Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిమీ టెర్రరిస్టులు టూత్ బ్రష్, చెక్కతోనే తాళం చెవి చేశారట.. ఎలా తప్పించుకున్నారంటే?

భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయేందుకు ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు పక్కా ప్లాన్ చేశారు. అయితే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఆ ఎనిమిది మంది హతమైనారు. కానీ జైలు నుంచి పారిపోవడానికి ఎనిమిది మంది సూపర్ ప్లాన్

సిమీ టెర్రరిస్టులు టూత్ బ్రష్, చెక్కతోనే తాళం చెవి చేశారట.. ఎలా తప్పించుకున్నారంటే?
, మంగళవారం, 1 నవంబరు 2016 (14:37 IST)
భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయేందుకు ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు పక్కా ప్లాన్ చేశారు. అయితే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఆ ఎనిమిది మంది హతమైనారు. కానీ జైలు నుంచి పారిపోవడానికి ఎనిమిది మంది సూపర్ ప్లాన్ వేశారని సమాచారం. తమకు అందుబాటులో ఉన్న టూత్ బ్రష్, ఓ చెక్కతోనే తమ ప్లాన్‌ను సక్సెస్ చేశారని తెలిసింది.  
 
టూత్ బ్రష్, చెక్కతోనే ఓ తాళం చెవిని రూపొందించిన టెర్రర్ మూకలు.. అదే తాళంతో బ్యారక్ గది తాళాలు తీసినట్టుగా అధికారులు గుర్తించారు. బ్యారక్ తాళాలు తీసి తప్పించుకునే క్రమంలోనే రమాశంకర్ అనే కానిస్టేబుల్‌ను హత్య చేశారు. 
 
అక్కడి నుంచి భోపాల్ శివారు ప్రాంతమైన కేజ్రానుల్లా ప్రాంతానికి చేరుకున్న టెర్రరిస్టులను పోలీసులు కాల్పులు జరిపి మట్టుబెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు 43 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమవగా.. ముగ్గురు పోలీసులకు గాయాలైనాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర చర్యలతో ప్రపంచానికి ముప్పు : అమెరికా పెంటగాన్