Publish Date: Fri, 06 Mar 2026 (16:37 IST)
Updated Date: Fri, 06 Mar 2026 (16:39 IST)
కొన్ని సందర్భాల్లో స్నేహితుల సరదా సంఘటనలో ప్రాణాలకే ముప్పు తెస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఓ షాపింగ్ మాల్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ షాపింగ్ మాల్ కారిడార్‌లో ఇద్దరు స్నేహితులు చేసిన చిన్నపాటి సరదా పెను ప్రమాదానికి దారితీసింది. ఒక స్నేహితుడు మరో స్నేహితుడి భుజాలపై ఎక్కి కూర్చోగా, కారిడార్ రెయిలింగ్ వద్ద ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి ఇద్దరూ కిందపడిపోయారు. ఈ అజాగ్రత్త వల్ల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు.
శ్రీలంక హోటల్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిపై పాక్ క్రికెటర్ అత్యాచారయత్నం!?
శ్రీలంకలోని ఓ హోటల్‌లో పని చేసే హౌస్ కీపింగ్ మహిళా సిబ్బంది పట్ల పాకిస్థాన్ క్రికెటెర్ ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన ఆ మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వచ్చి ఆమెను రక్షించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన హోటల్ యాజమాన్యం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు వార్నింగ్ ఇచ్చింది. సదరు క్రికెటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన జట్టు మేనేజర్.. సమస్య పెద్దది కాకుండా, హోటల్ యాజమాన్యానికి, సదరు మహిళకు క్షమాపణలు చెప్పించారు. దీంతో ఆ సమస్య సద్దుమణిగిపోయింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
టెలికాం ఆసియా స్పోర్ట్ నివేదిక ప్రకారం శ్రీలంకతో జరిగిన చివరి సూపర్ 8 మ్యాచ్‌లు ముందు క్యాండీలోని గోల్డెన్ క్రౌన్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ జట్టులోని ఓ ఆటగాడు హోటల్‌లోని హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేసే మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. అనంతరం ఈ విషయాన్ని పాకిస్థాన్ జట్టు మేనేజర్ నవాబ్ చీమా దృష్టికి తీసుకెళ్లారు.
హోటల్ యాజమాన్యం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి, కఠిన చర్యలు తీసుకోవాలని భావించింది. అయితే, మేనేజర్ నవాబ్ చీమా వెంటనే జోక్యం చేసుకున్నారు. సదరు ఆటగాడి తరపున హోటల్ యాజమాన్యానికి, బాధితురాలికి క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా క్రమశిక్షణ చర్యగా ఆ ఆటగాడికి జరిమానా విధించి, వివాదాన్ని అక్కడికక్కడే సద్దుమణిగేలా చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా సెమీఫైనల్స్క అర్హత సాధించలేకపోయింది.
ఈ వివాదంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు ఆటగాడిని క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుపరిచి, మరింత కఠినమైన శిక్ష విధించే అవకాశం ఉందని సమాచారం. పాకిస్థాన్ ఆటగాళ్లు విదేశీ పర్యటనల్లో ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు.
గతంలో ఇంగ్లండ్ పర్యటనలో యువ బ్యాటర్ హైదర్ అలీపై అత్యాచార ఆరోపణలు రాగా, ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని విడుదల చేసింది. అలాగే, కొన్నేళ్ల క్రితం మలేషియా పర్యటనలో జట్టు మసార్ మలంగ్ అలీ కూడా మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించి జరిమానాకు గురయ్యాడు. తాజా ఘటనతో పాక్ క్రికెట్ మరోసారి పరువు కోల్పోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.