Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఛత్తీస్‌గఢ్‌ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలోనూ వేధింపులు.. నెలసరి తేదీలను నోట్ చేసుకుని.?

దేశంలో మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. పురుషులకు సమానంగా అన్నీ రంగాల్లో మహిళలు రాణించినా.. వేధింపులు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని చంఖూరీ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందే

ఛత్తీస్‌గఢ్‌ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలోనూ వేధింపులు.. నెలసరి తేదీలను నోట్ చేసుకుని.?
, గురువారం, 25 ఆగస్టు 2016 (17:33 IST)
దేశంలో మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. పురుషులకు సమానంగా అన్నీ రంగాల్లో మహిళలు రాణించినా.. వేధింపులు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని చంఖూరీ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందే పోలీసు అధికారిణులు కూడా వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు శిక్షణ పొందుతున్న డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఫిర్యాదుతో ఈ దారుణంలో బట్టబయలైంది. ట్రైనర్ వల్ల సదరు శిక్షణా కేంద్రంలో ఎదుర్కొంటున్న వేధింపుల్ని పోలీసు అధికారిణులు బయటపెట్టారు.
 
వివరాల్లోకి వెళితే.. ఔట్‌డోర్ ఇన్‌ఛార్జ్, డీఎస్‌పీ నీలకాంత్ సాహు తమపై వివక్ష చూపుతున్నారని పోలీసు అధికారిణులు ఆరోపించారు. ఓ మహిళాధికారి బెల్టుకు కింది భాగంలో సాహు కర్రతో పొడిచి, అభ్యంతరకరంగా మాట్లాడారని.. స్విమ్మింగ్ పూల్ నుంచి మహిళల్ని జుట్టు పట్టుకుని లాగుతున్నారని పోలీసు అధికారిణులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.  
 
ఇంకా చెప్పాలంటే.. ఓ మహిళాధికారి బట్టలకు అంటుకున్న మురికిని కర్రతో తుడిచారని, తమ నెలసరి తేదీలను కూడా సాహు నమోదు చేసుకుని.. కిందటి నెలకు ఈ నెలకు తేడా ఉందని గట్టిగా అరుస్తూ అందరి ముందు అవమానకరంగా మాట్లాడుతున్నట్లు సాహుపై ఫిర్యాదు చేశారు. అలాగే నీలకాంత్ సాహు తన  భార్యకు రుతుస్రావం సమయంలో నొప్పులేవీ రావడం లేదని, మీకెందుకు వస్తున్నాయని, సాకులు చెప్పి తప్పించుకోవద్దని హెచ్చరిస్తూ ఉంటారన్నారు. 
 
రుతుస్రావం జరిగిన మహిళాధికారులను శిక్షణకు దూరంగా ఉంచుతున్నారని, నెలసరి జరిగినప్పుడు విశ్రాంతి తీసుకోవడం పోలీసు అకాడమీ నిబంధనల్లో లేవన్నారు. ఇంకా గర్భిణీ అధికారిణితో కూడా సాహు అభ్యంతరకరంగా మాట్లాడారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు నీలకాంత్ సాహును హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీస్ లైన్స్‌కు తరలించి, విధుల నుంచి విముక్తి కల్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ తాగి మాట్లాడుతున్నారా? మగాడైతే నిలబడాలి: యాష్కీ సవాల్