Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహారాష్ట్ర శివసేనకు చుక్కెదురు: డెడ్ లైన్.. 2:1 నిష్పత్తిలో..?

మహారాష్ట్ర శివసేనకు చుక్కెదురు: డెడ్ లైన్.. 2:1 నిష్పత్తిలో..?
, శనివారం, 1 నవంబరు 2014 (14:21 IST)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు చుక్కెదురైంది. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం పొత్తుకు సంబంధించి వెంటనే స్పష్టత ఇవ్వాలని శివసేన డెడ్ లైన్ విధించిందట. అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పద్నాలుగు రోజుల సమయం ఇచ్చారు. అప్పటికల్లా పొత్తుపై ఏదీ తేల్చకపోతే వ్యతిరేక ఓటు వేస్తామని సేన హెచ్చరిస్తున్నట్లు సమాచారం. 
 
మరోవైపు, 2:1 నిష్పత్తిలో ప్రభుత్వంలో పదవులు తీసుకునే ప్రతిపాదనకు శివసేన అంగీకరిస్తుందని అంటున్నారు. మొత్తం 32 మంది మంత్రులతో ఉండే ఫడ్నవిస్ క్యాబినెట్‌లో 20 మంది బీజేపీ వారయితే, పది శివసేనకు ఇవ్వనున్నారట.
 
మిగతా రెండు మంత్రి పదవులు చిన్న భాగస్వామ్య పక్షాలకు వెళతాయి. ఇదిలాఉంటే, సేన ఉపముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu