Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షీనా హత్య కేసు : రాహుల్ బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోనులో కీలక విషయాలు

షీనా బోరా హత్య కేసులో కీలక ఆధారాలు వెలుగుచూశాయి. ఈ రికార్డుల ద్వారా పీటర్ ముఖర్జీ కూడా షీనా హత్య కేసులో కుట్రదారుడేనని తేలింది. రాహుల్ ఈ సంభాషణలను తన బ్లాక్ బెర్రీ స్మార్ట్‌ఫోన్లో రికార్డు చేశాడు. ఈ

షీనా హత్య కేసు : రాహుల్ బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోనులో కీలక విషయాలు
, శుక్రవారం, 26 ఆగస్టు 2016 (10:31 IST)
షీనా బోరా హత్య కేసులో కీలక ఆధారాలు వెలుగుచూశాయి. ఈ రికార్డుల ద్వారా పీటర్ ముఖర్జీ కూడా షీనా హత్య కేసులో కుట్రదారుడేనని తేలింది. రాహుల్ ఈ సంభాషణలను తన బ్లాక్ బెర్రీ స్మార్ట్‌ఫోన్లో రికార్డు చేశాడు. ఈ ఆధారాలే కేసు విచారణకు కీలకంగా మారాయి.
 
షీనా బోరా కేసు దేశంలో పెను సంచలనం సృష్టించిన విషయంతెల్సిందే. ఈ హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీతో కలిసి పీటర్ ముఖర్జీ తన తనయుడు రాహుల్ను తప్పుదోవ పట్టించిన టేపులు బహిర్గతమయ్యాయి. షీనా అదృశ్యమైనప్పుడు రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు తండ్రి, పిన్నతల్లితో సంభాషించిన రికార్డులు వెలుగులోకి వచ్చాయి. 
 
మొదట ఈ టేపులను ఖార్ పోలీసులకు అనంతరం సీబీఐకు రాహుల్ సమర్పించాడు. రాహుల్ సమర్పించిన టేపుల సంభాషణలతో పీటర్కు ఈ హత్య, నేరపూరిత కుట్రలో భాగమున్నట్టు తేలింది. మొత్తం 20 రికార్డింగ్లో 7 టేపులు అవసరమైనవిగా, మిగతా 13  టేపులు కేసుకు సంబంధం లేనివిగా వెల్లడైంది. సీబీఐ విచారణలో ఈ టేపులను ఇప్పటికే కీలక ఆధారాలుగా పరిగణించినట్టు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగానికి ఎసరు పెట్టిన పచ్చబొట్టు... ఎలా?