Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరుసకు సోదరి.. అయినా కోర్కె తీర్చాలని వెంటపడిన కామాంధుడు!

వరుసకు సోదరి.. అయినా కోర్కె తీర్చాలని వెంటపడిన కామాంధుడు!
, సోమవారం, 28 జులై 2014 (16:55 IST)
ఆమె వరుసకు సోదరి.. కానీ, తన కోర్కె తీర్చాలంటూ ఆ కామాంధుడు వెంటపడ్డాడు. ఆ వేధింపులను భరించలేక పెద్దలకు చెప్పింది. అంతే.. ఆ కామాంధుడిని గ్రామ రచ్చబండకు రప్చించి నిలదీశారు. ఈ కామదాహం కథ శ్రీకాకుళం జిల్లాలో చోటు చోసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్నయ్యపేటకు చెందిన మజ్జి రమణ అనే యువకుడు వరుసకు సోదరి అయిన వివాహితను కోరిక తీర్చాలంటూ వెంటపడుతూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఫోనులో అసభ్యంగా మాట్లాడుతూ వేధించసాగాడు. దీంతో ఆమె ఫోన్ కట్ చేసేది. అయినా అతను వేధింపులు మానకపోవడంతో... అతని మాటలను రికార్డు చేసి పెట్టింది. ఈ క్రమంలో గ్రామంలోని అప్పర్ ప్రైమరీ పాఠశాల వద్ద బోరు వద్దకు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆ వివాహిత స్నానానికి వెళ్లింది. అక్కడ కాపుకాసిన రమణ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. 
 
ఆమె కేకలు వేయడంతో సమీపంలో పొలానికి వెళ్లిన బాబాయి వరుస అయ్యే పొట్నూరు లక్ష్మణ చేరుకుని రమణను పట్టుకుని రచ్చబండ వద్దకు తీసుకొచ్చి నిలదీశాడు. దీంతో ఆమె వర్గీయులు, రమణ వర్గీయులు పోగయ్యారు. పరస్పర విమర్శలతో ఘర్షణకు దిగారు. అదేసమయంలో రమణకు రాజకీయ పలుకుబడి ఉందని... అతని నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇంతలో తనను కొట్టి గాయపరిచారంటూ రమణ ఆమె, ఆమె తరపు బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu