Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేవలం 208 ఇళ్లకే.. రూ. 1,078 కోట్లా.. ఇదో పెద్ద స్కామ్: సుప్రీం

కేవలం 208 ఇళ్లకే.. రూ. 1,078 కోట్లా.. ఇదో పెద్ద స్కామ్: సుప్రీం
, శనివారం, 25 ఏప్రియల్ 2015 (10:41 IST)
కేంద్రం అమలు చేస్తున్న నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అర్బన్ షెల్టర్ హోంల నిర్మాణం పేరిట వందల కోట్ల రూపాయలను రాష్ట్రాలకు అప్పగించగా, పనులు జరగలేదని ఆక్షేపించింది.

"రూ. 1,078 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు అందిస్తే, కేవలం 208 ఇళ్లు మాత్రమే కట్టారు. మీరు ఇచ్చిన అఫిడవిట్ చూస్తుంటే మొత్తం విషయం అర్ధం అవుతోంది. ఇదో పెద్ద స్కామ్" అని జస్టిస్ మదన్ బి లోకుర్, యూ లలిత్ లతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. 
 
అంతకుముందు పట్టణ పేదలకు షెల్టర్లపై మహారాష్ట్రకు రూ. 170 కోట్లివ్వగా, ఒక్కటీ కట్టలేదని, ఉత్తర ప్రదేశ్‌కు రూ. 180 కోట్లివ్వగా, 37 షెల్టర్లు కట్టారని కేంద్రం కోర్టుకు తెలిపింది. మొత్తం వ్యవహారంలో కేంద్రం ఇచ్చిన నిధులను ఏ రాష్ట్రం ఎలా వెచ్చించిందో తెలియజేయాలని, రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీకోర్టు ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu