Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమాధినే అంత గట్టిగా కొట్టావే.. జయమ్మను మరెంత గట్టిగా కొట్టావో..?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ జైలులో చిప్పకూడు తింటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చిన్నమ్మపై జోకులు పేలుతున్నాయి. దీనిపై అన్నాడీఎంకే ఐటీ విభాగం సీరియస్ అయ్యింది. అయినా జోకుల

సమాధినే అంత గట్టిగా కొట్టావే.. జయమ్మను మరెంత గట్టిగా కొట్టావో..?
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (11:32 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ జైలులో చిప్పకూడు తింటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చిన్నమ్మపై జోకులు పేలుతున్నాయి. దీనిపై అన్నాడీఎంకే ఐటీ విభాగం సీరియస్ అయ్యింది. అయినా జోకులు మాత్రం ఆగలేదు. చిన్నమ్మ జైలుకు వెళ్తూ వెళ్తూ జయలలిత సమాధిపై అంత బలంగా కొట్టి శపథం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల జోకులు పేలుతున్నాయి. సమాధిపైనే చిన్నమ్మ ఇంత బలంగా కొట్టిందే.. జయమ్మ బతికున్నప్పుడు మరెంత గట్టిగా కొట్టిందోనని టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్ విమర్శించారు. 
 
గురువారం ఈరోడ్‌లో మాట్లాడుతూ.. శశికళ బెంగుళూరు జైలుకు వెళుతూ శపథం పేరుతో జయ సమాధిపై చేతితో బాదిన దృశ్యాలను ప్రసార మాధ్యమాల్లో చూసి దిగ్ర్భాంతి చెందానని, ఎన్నో ఏళ్ల పగతో రగిలిపోతున్న వ్యక్తిగా శశికళ కనిపించిందన్నారు. సమాధినే ఇంత బలంగా కొట్టిన ఆమె.. జయను ఎన్ని సార్లు ఎంత బలంగా కొట్టిందోనని తనతో పాటు దేశప్రజలందరికీ అనుమానంగానే ఉందన్నారు.
 
రాష్ట్రంలో ఇప్పటిదాకా అవినీతికి పాల్పడి అక్రమార్జనే ధ్యేయంగా వ్యవహరించిన అన్నాడీఎంకే నాయ కులకు సుప్రీంకోర్టు తీర్పు చక్కటి గుణపాఠమని, ప్రజల సొమ్మును దోచుకున్నవారెంతటివారైనా కటకటాలపాలు కావాల్సిందేనని ఈ తీర్పు ద్వారా హెచ్చరిస్తున్నట్లుందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లోకుళ్ళిన మాంసంతో బిర్యానీ వండుతున్నారు: 15 రోజులు నిల్వచేసి? బీకేర్ ఫుల్..!