Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిస్టర్ మ్యారేజ్‌కు మోడీని ఆహ్వానించిన సల్మాన్ ఖాన్!

సిస్టర్ మ్యారేజ్‌కు మోడీని ఆహ్వానించిన సల్మాన్ ఖాన్!
, శనివారం, 1 నవంబరు 2014 (12:41 IST)
సిస్టర్ అర్పితా ఖాన్ వివాహానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం వచ్చేవారం సల్మాన్ ఢిల్లీ వెళ్ళనున్నాడు. అర్పిత వివాహం ఈ నెల 18న జరగనుంది. 
 
ఈ విషయమై సల్మాన్ తండ్రి, ప్రముఖ సినీ రచయిత సలీం ఖాన్ మాట్లాడుతూ, అర్పిత పెళ్ళికి మోదీని ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. 
 
అర్పిత గత ఏడాదిన్నరగా ఢిల్లీకి చెందిన ఆయుష్‌తో ప్రేమాయణం కొనసాగిస్తోంది. ఇప్పుడు అతడినే మనువాడనుంది. వీరి వివాహానికి హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలెస్ వేదికగా నిలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu