Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రుచికా గిర్హోత్ర కేసు... సుప్రీం కోర్టు తుది తీర్పు.. నిందితుడు జైలుకెళ్ళాల్సిన పనిలేదు..

టెన్నిస్ క్రీడాకారిణి రుచికా గిర్హోత్ర కేసుపై సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పును వెలువరించింది. అయితే దాదాపు 25 ఏళ్ల క్రితం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన రుచికా కేసులో దోషిగా తేలిన‌ మాజీ డీజీపీ ఎస్‌

రుచికా గిర్హోత్ర కేసు... సుప్రీం కోర్టు తుది తీర్పు.. నిందితుడు జైలుకెళ్ళాల్సిన పనిలేదు..
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (18:46 IST)
టెన్నిస్ క్రీడాకారిణి రుచికా గిర్హోత్ర కేసుపై సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పును వెలువరించింది. అయితే దాదాపు 25 ఏళ్ల క్రితం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన రుచికా కేసులో దోషిగా తేలిన‌ మాజీ డీజీపీ ఎస్‌పీఎస్‌ రాథోడ్ జైలు శిక్ష అనుభ‌వించే వీలు లేదు. కేసులో నిందితుడు ఎస్‌పీఎస్‌ రాథోడ్ 1990లో అప్పటి ఐజీపీగా, హరియాణా లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా బాధ్య‌తలు నిర్వ‌ర్తించారు. 
 
ఆత్మ‌హ‌త్య చేసుకున్న 14 వేళ్ల‌ రుచికా గిర్హోత్ర అనే జూనియర్‌ టెన్నిస్‌ క్రీడాకారిణిపై ఆయ‌న‌ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఈ నేరానికి గానూ ఇన్నాళ్లూ నిందితుడిగా ఉన్న ఆయ‌న ఇప్పటికే జైలు శిక్ష అనుభవించారని కోర్టు తెలిపింది.
 
కాగా రాథోడ్ పై కేసు పెట్టడంతో పోలీసులు వేధింపులు తాళలేక చిన్న వ‌య‌సులోనే ఎంతో ఒత్తిడికి గుర‌యిన రుచిక 1993, డిసెంబర్‌ 28న విషం తాగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. దాదాపు ఇర‌వై ఏళ్ల త‌రువాత ఆమెపై వేధింపుల కేసులో విచారణ చేపట్టిన చండీగఢ్ న్యాయ‌స్థానం చివ‌రకు రాథోడ్‌ను దోషిగా తేల్చింది. 2009 డిసెంబర్‌లో కేసులో తీర్పునిస్తూ, రాథోడ్‌కు 18 నెలల శిక్ష విధించింది. ఇప్పటికే జైలు శిక్ష పడటంతో అతనిక జైలుకెళ్ళాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేప ఆకులు, కాకరకాయలను లొట్టలేస్తూ చాక్లెట్లలా తినేస్తున్న రెండేళ్ల చిన్నారి