Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నల్లధనంపై ఉక్కుపాదం.. నోట్ల రద్దుతో ఐటీ సోదాలు: డబ్బు రూపంలో రూ.112 కోట్లు వెలికితీత

నల్లధనం ఏరివేత, అవినీతి అంతం కోసం కొంత కాలం కష్టాలను ఓర్చుకోండి అంటూ ప్రధాని నరేంద్రమోడీ అమలు చేసిన సంగతి తెలిసిందే. నల్లధనవంతుల, అవినీతిపరుల ఆట కట్టించే ఉద్దేశ్యంతో గత ఏడాది నవంబర్ 8న పెద్దనోట్లను రద

నల్లధనంపై ఉక్కుపాదం.. నోట్ల రద్దుతో ఐటీ సోదాలు: డబ్బు రూపంలో రూ.112 కోట్లు వెలికితీత
, సోమవారం, 9 జనవరి 2017 (10:29 IST)
నల్లధనం ఏరివేత, అవినీతి అంతం కోసం కొంత కాలం కష్టాలను ఓర్చుకోండి అంటూ ప్రధాని నరేంద్రమోడీ అమలు చేసిన సంగతి తెలిసిందే. నల్లధనవంతుల, అవినీతిపరుల ఆట కట్టించే ఉద్దేశ్యంతో గత ఏడాది నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు మోడీ చేసిన ప్రకటనతో నల్లబాబులు బయటపడ్డారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఐటీ అధికారులు రంగంలోకి దిగి పలు చోట్ల సోదాలు నిర్వహించారు.
 
నోట్ల రద్దు ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచి నవంబర్ 9వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 5వ తేదీ వరకు ఐటీ అధికారులు చేపట్టిన సోదాల్లో రూ.4,807 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ మొత్తం వెల్లడించని లేదా లెక్కల్లో చూపని సొమ్మే. 
 
ఇంకా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తంలో రూ.112 కోట్లు కొత్త నోట్ల రూపంలో ఉండగా, ఆ నోట్లలో అధిక శాతం రెండు వేల రూపాయల నోట్లే ఉన్నాయి. కాగా, నవంబర్ 9 నుంచి దేశ వ్యాప్తంగా మొత్తం 1138 చోట్ల సోదాలు నిర్వహించామని, 5184 మందికి నోటీసులు ఇచ్చినట్లు ఐటీ అధికారులు తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. నల్లధనం రద్దు వెనుక అమెరికా కుట్రపూరిత ఎజెండా వుందని చెప్తోంది ఏషియన్‌ పసిఫిక్‌ రీసెర్చ్‌ (ఏపీఆర్‌) సంస్థ. భారతదేశ క్రూరమైన నోట్ల రద్దు ప్రాజెక్టు వెనుక పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నవంబర్‌ 8న ప్రధాని మోదీ నోట్ల రద్దు ప్రకటించడానికి 4 వారాల ముందు.. భారత్‌లో నగదు రహిత చెల్లింపులను భారీస్థాయిలో పెంచేయడం లక్ష్యంగా ‘క్యాటలిస్ట్‌: సంఘటిత నగదు రహిత చెల్లింపు భాగస్వామ్యం’ అనే పథకాన్ని యూఎస్‌ ఎయిడ్‌ ప్రకటించింది.
 
భారత్‌లో నగదు రహిత లావాదేవీలకు ఉన్న అడ్డంకులపై గత ఏడాది జనవరిలోనే యూఎస్‌ ఎయిడ్‌ నివేదిక రూపొందించింది. ‘బియాండ్‌ క్యాష్‌’ అనే పేరుతో చేసిన ఆ నివేదికలో.. దేశంలో 97% లావాదేవీలు నగదు రూపంలో జరుగుతున్నాయని, కేవలం 55% మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, అందులోనూ 29% ఖాతాలనే గత మూడు నెలల్లో ఉపయోగించారని ఏపీఆర్ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్బీఐ గవర్నర్‌కు ఊహించని షాక్... నోట్ల రద్దు మీ ఒక్కరి నిర్ణయమా? వివరణ ఇవ్వండి : పీఏసీ నోటుసులు