Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మమ్మల్ని మంచంపై తోసి.. అత్యంత క్రూరంగా ఒకరి తర్వాత మరొకరు.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు..

మయాన్మార్ సైనికుల అమానుష దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి. యువతులపై సైనికులు అత్యంత అమానుషంగా అత్యాచారాలు చేయడం వల్ల ఎంతోమంది రోహింగ్యా శరణార్ధ మహిళలు భయంతో వణుకుతూ కొండల్లో దుర్భర జీవనం గడుపుతున్నారని ఐక

మమ్మల్ని మంచంపై తోసి.. అత్యంత క్రూరంగా ఒకరి తర్వాత మరొకరు.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు..
, సోమవారం, 28 నవంబరు 2016 (14:29 IST)
మయాన్మార్ సైనికుల అమానుష దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి. యువతులపై సైనికులు అత్యంత అమానుషంగా అత్యాచారాలు చేయడం వల్ల ఎంతోమంది రోహింగ్యా శరణార్ధ మహిళలు భయంతో వణుకుతూ కొండల్లో దుర్భర జీవనం గడుపుతున్నారని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి వెల్లడించారు.

సైనిక దాడులతో  భయభ్రాంతులైన బాధిత మహిళలు తమ నివాసాలను వదిలి బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని కొండల్లో కోనల్లో ఆకలితో అలమటిస్తూ తలదాచుకుంటున్నారు. సైనికులు మూకుమ్మడిగా దాడి చేయడంతో తమ సోదరుడు పారిపోగా వారు ఇళ్లను దహనం చేసి తమ అమ్మాయిలపై అత్యాచారం జరిపారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
బాధిత మహిళలను కదిలిస్తే.. మయాన్మార్ సైనికులు అత్యంత పైశాచికంగా ప్రవర్తించారని తెలిసిపోకతప్పదు. తమపై మయాన్మార్ సైనికులు ఒకరి తర్వాత మరొకరు వరుసబెట్టి అత్యంత క్రూరంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, మమ్మల్ని మంచంపై తోసి ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత మహిళలు, రోహింగ్యా శరణార్థ మహిళలు కన్నీళ్లతో చెప్పుకున్నారు. సైనికుల దాడులతో తాము కిలోమీటర్ల దూరం నడచి సరిహద్దుల్లో తలదాచుకున్నామని వారు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకులకు వెళ్లకుండానే బ్లాక్ వైటైపోతోంది.. టీడీపీ నేతల లీలలు అన్నీఇన్నీకావయా....