Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నల్ల కుబేరుల జాబితాలో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా!

నల్ల కుబేరుల జాబితాలో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా!
, బుధవారం, 22 అక్టోబరు 2014 (19:53 IST)
నల్ల కుబేరుల జాబితా విడుదల చేస్తే కాంగ్రెస్ పనైపోతుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. నల్ల కుబేరుల జాబితాపై కాంగ్రెస్ భయపడుతోందన్న బీజేపీ వాదన నిజమేనని తేలుతోంది. ఎందుకంటే, సదరు జాబితాలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సమాచారం తెలుసుకున్న బీజేపీ, వాద్రా చుట్టూ ఉచ్చు బిగించి కాంగ్రెస్‌ను మరోమారు చావుదెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 
 
హర్యానాలో డీఎల్ఎఫ్ భూమి బదలాయింపు వ్యవహారంతో ఒక్కసారిగా వాద్రాపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా నల్ల కుబేరుల జాబితాలో ఆయన పేరుందన్న లీకులను బీజేపీనే జారీ చేసిందన్న వాదనా లేకపోలేదు. నల్ల కుబేరుల జాబితాలో వాద్రా పేరుతో పాటు ఓ కేంద్ర మాజీ మంత్రి పేరు కూడా ఉన్నట్లు తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu