Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.500 ఇస్తే రాళ్లు రువ్వే ముఠాలకు కళ్లెం.. డబ్బుల్లేక సైలెంట్‌గా?: మనోహర్ పారికర్

రూ.500 ఇస్తే రాళ్లు రువ్వడం.. రూ.1000 ఇస్తే మరిన్ని విద్రోహ చర్యలకు, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడేవారి చేతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కళ్లెం వేశారని కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. పెద్ద

రూ.500 ఇస్తే రాళ్లు రువ్వే ముఠాలకు కళ్లెం.. డబ్బుల్లేక సైలెంట్‌గా?: మనోహర్ పారికర్
, మంగళవారం, 15 నవంబరు 2016 (13:16 IST)
రూ.500 ఇస్తే రాళ్లు రువ్వడం.. రూ.1000 ఇస్తే మరిన్ని విద్రోహ చర్యలకు, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడేవారి చేతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కళ్లెం వేశారని కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. పెద్దనోట్లను రద్దు చేయడం ద్వారా ముష్కర మూకలకు ఎలాంటి డబ్బులు అందడం లేదని.. దీంతో రాళ్లు రువ్వే ముఠాలు సైలెంట్‌గా ఉన్నాయని పారికర్ వ్యాఖ్యానించారు. 
 
దేశవ్యాప్తంగా పెద్దనోట్ల రద్దు కారణంగా టెర్రరిస్టులకు ఆర్థిక సాయం అందకపోవడంతో ఉగ్రవాద చర్యలు బాగా తగ్గుముఖం పట్టాయని మనోహర్ పారికర్ తెలిపారు. ప్రత్యేకించి కాశ్మీర్‌లోయలో నిత్యం భద్రతాదళాలపై రాళ్లు రువ్వే ముఠాలు డబ్బుల్లేక.. నోట్ల రద్దుతో చేతులు ముడుచుకుని కూర్చున్నాయని పారికర్ వ్యాఖ్యానించారు. ఇలా ఉగ్ర చర్యలకు బ్రేక్ వేసేట్లు పెద్దనోట్లను రద్దు చేసి సాహసోపేత నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మనోహర్ పారికర్ కృతజ్ఞతలు తెలిపారు. 
 
పొరుగుదేశంపై సర్జికల్‌ స్ట్రయిక్స్‌తో పాటు దేశ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయాలు తిరుగులేనివని ప్రశంసించారు. ప్రధాని తీసుకున్న నిర్ణయం కొన్ని రాజకీయపక్షాలకు మింగుడుపడటం లేదని, ఎన్నికల సమయంలో అనైతికంగా పంచే డబ్బు పంపిణీకి కూడా కళ్లెం పడుతుందని మనోహర్ వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Heeraben Modiకి తప్పని నోట్ల రద్దు కష్టాలు.. పాత నోట్లిచ్చి కొత్త నోట్లు తీసుకున్నారు..