బావిలో పడిన ఆడపులి.. ది గ్రేట్ ఆపరేషన్.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. ఆపై..?
రణతంబోర్ నేషనల్ పార్కుకు చెందిన ఓ ఆడపులి బావిలో పడిపోతే.. అటవీ శాఖాధికారులు గొప్ప ఆపరేషన్‌తో రక్షించారు. టీ-83 అనే ఆడపులి ఖావా అనే గ్రామంలో ఉన్న బావిలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారుల
రణతంబోర్ నేషనల్ పార్కుకు చెందిన ఓ ఆడపులి బావిలో పడిపోతే.. అటవీ శాఖాధికారులు గొప్ప ఆపరేషన్‌తో రక్షించారు. టీ-83 అనే ఆడపులి ఖావా అనే గ్రామంలో ఉన్న బావిలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు గ్రామస్తుల సాయంతో పులిని ప్రాణాలతో రక్షించారు. ఇందుకోసం ఎంతో క్లిష్టంగా దానిని వెలికి తీసే ఆపరేషన్ నిర్వహించారు.
ఇందుకోసం వారు తాడు, వల, ఇనుప బోను, ఒక ఇనుప బొంగుల మంచాన్ని సిద్ధం చేసుకుని పులిని కాపాడారు. తొలుత ఇనుప బోనులోకి ఓ అధికారిని ఉంచి దానిని బావిలోకి దించగా అతను పులికి మత్తు మందు ఇచ్చాడు.
ఆపై మంచానికి నాలుగువైపులా తాడును కట్టి లోపలికి దించారు. దీంతో అతడు ఆ మంచంపై కూర్చుని పులిని వలలో బందించి మంచంపైకి ఎక్కించి బయటకు తీసుకొచ్చాడు. అనంతరం పార్క్‌లోకి వదిలేశారు. ఈ ఆపరేషన్ నిర్వహించే సమయంలో గ్రామస్తులు వీడియోలు తీశారు. పర్యాటకులు కెమెరాల్లో బంధించారు.