Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాముడే ఇమామ్.. అయోధ్యే మాకు పుణ్యక్షేత్రం : ముస్లిం మహిళలు

రాముడే ఇమామ్.. అయోధ్యే మాకు పుణ్యక్షేత్రం : ముస్లిం మహిళలు
, సోమవారం, 30 మార్చి 2015 (14:52 IST)
ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గం వారణాసిలో ముస్లిం మహిళలు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. రాముడే తమ ఇమామ్ అని, అయోధ్య తమకు పుణ్యక్షేత్రమని చాటుతున్నారు. 
 
శ్రీరామనవమి పర్వదినాన్ని వారు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. విశాల్ భారతి సంస్థాన్ (వీబీఎస్) ఆధ్వర్యంలో వరుణనగర్ కాలనీలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ముస్లిం మహిళలు రాముడిని స్తుతిస్తూ కీర్తనలు పాడారు. నజ్నీన్ అన్సారి అనే మహిళ మాట్లాడుతూ "శ్రీరాముడు మనందరికీ పూర్వీకుడు. ప్రపంచానికే ఆదర్శం. విద్వేషాన్ని పారదోలే ఏకైక నామధేయం ఇదే" అని పేర్కొన్నారు.  
 
కాగా, నజ్నీన్ తదితరులు అయోధ్యలో రామమందిరం కట్టాలని ప్రధాని మోడీకి ఓ విజ్ఞాపన పత్రం కూడా పంపారు. అయోధ్య రాముడికి చెందినదని, దేశంలోని ముస్లింలు హిందువుల నుంచి గౌరవాన్ని కోరుకుంటున్నట్టయితే, రాముడి జన్మస్థలంలో ఆలయ నిర్మాణానికి ముందుకురావాలని వారు పిలుపునిస్తున్నారు. హనుమాన్ చాలీసాను ఉర్దూలోకి తర్జుమా చేసిన నజ్నీన్, 'శ్రీరామ్ హారతి', 'శ్రీరామ్ ప్రార్థన' గీతాలను రచించారు.

Share this Story:

Follow Webdunia telugu