Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్‌ను ఏకేసిన రాజ్‌నాథ్: జాతీయ రహదారుల్లో సీసీ కెమెరాలు!

పాకిస్థాన్‌ను ఏకేసిన రాజ్‌నాథ్: జాతీయ రహదారుల్లో సీసీ కెమెరాలు!
, శనివారం, 29 నవంబరు 2014 (12:20 IST)
పాకిస్థాన్‌ను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏకిపారేశారు. దేశ రక్షణలో పోలీసు, నిఘా వ్యవస్థల పాత్ర చాలా కీలకమని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం ఒక సవాలు వంటివని చెప్పారు. 
 
ఇటీవల జరిగిన జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదయిందన్న రాజ్ నాథ్, ఇంత ఎక్కువ శాతం పోలింగ్ ఎన్నడూ జరగలేదని వివరించారు.
 
ఇక ఉగ్రవాదం చాలా తీవ్రమైన అంశమని, దానిని చిన్నదిగా చూడబోమని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల డీజీపీలతో గౌహతిలో రెండు రోజుల పాటు జరగనున్న సమావేశానికి శనివారం ఉదయం రాజ్ నాథ్ హాజరయ్యారు. ఉగ్రవాదం, విదేశీ చొరబాట్లు, శరణార్థుల అంశాలపై ఆయన చర్చిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సరిహద్దులో పాక్ దురాగతాలకు పాల్పడుతోందని, సరిహద్దు ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని తెలిపారు. 2019 నాటికి అన్ని జాతీయ రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu