Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయలలితకు రజనీకాంత్ లేఖ : ఆయురాగ్యోలతో సుఖంగా ఉండండి!

జయలలితకు రజనీకాంత్ లేఖ : ఆయురాగ్యోలతో సుఖంగా ఉండండి!
, ఆదివారం, 19 అక్టోబరు 2014 (17:54 IST)
అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష పడిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లేఖ రాశారు. గత నెల 27వ తేదీన జైలుకెళ్లిన జయలలిత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం విడుదలై చెన్నైకు వచ్చిన విషయం తెల్సిందే. 
 
దీంతో ఆమెకు రజనీకాంత్ లేఖ రాశారు. జయలలితకు ఆయురారోగ్యాలు కలగాలని కోరారు. అంతేగాకుండా, ఆమెకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు ఆమెకు నాలుగేళ్ళ జైలు శిక్ష విధించగా, సుప్రీం కోర్టు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu