Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌ను నంబర్ వన్‌గా నిలపాలన్నదే తమ లక్ష్యం : నరేంద్ర మోడీ

భారత్‌ను నంబర్ వన్‌గా నిలపాలన్నదే తమ లక్ష్యం : నరేంద్ర మోడీ
, శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (17:27 IST)
ప్రపంచంలో భారత్‌ను నంబవర్‌గా నిలపాలన్నదే తమ ఏకైక లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన శుక్రవారం లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షాలపై ఆయన ధ్వజమెత్తారు. 
 
పేదలకు లబ్ది చేకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించిన ఆయన తమ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ బిల్లు ఆర్డినెన్స్‌లో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. భూసేకరణ చట్టంపై చాలా చర్చ జరుగుతోందన్న ఆయన భూసేకరణ చట్టంతో రైతులకు నష్టమని గత పాలకులకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. యూపీఏ విధానాలు మంచివైతే ప్రజలు ఎందుకు ఓడించారని నిలదీశారు. ఇవాళ చట్టంలో మార్పులు కుదరదంటూ రాజకీయాలు చేస్తారా అని మండిపడ్డారు. 
 
ప్రభుత్వ ప్రాధాన్యాలను రాష్ట్రపతి వివరించారన్నారు. దేశంలో సమస్యలను కాలనుగుణంగా పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల పేరు మార్పు సమస్యే కాదన్న మోడీ పథకాల అమలే ముఖ్యమని తేల్చిచెప్పారు. సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని తెలిపారు. ఎంపీలు సానుకూల ధోరణి అలవర్చుకోవాలని ప్రధాని సూచించారు. 
 
ఆశించిన దానికంటే ఎక్కువ మొత్తంలో వచ్చిన నిధులతో రాష్ట్రాలు ఆశ్చర్యపోయాయని గుర్తు చేశారు. 42 శాతం వాటాతో పాటు పంచాయతీలు, మునిసిపాలిటీలకు అదనంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చాక రాష్ట్రాలకు తొలిసారిగా ఆర్థిక బలం చేకూర్చామన్నారు. భారత్‌ను నెంబర్‌వన్‌గా నిలపాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించడం 150 కోట్ల ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. సమన్వయంతో సమిష్టి కృషే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu