Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హెల్మెట్ లేదని భార్యకే జరిమానా: శభాష్ అనిపించుకున్న ట్రాఫిక్ ఎస్సై!

హెల్మెట్ లేదని భార్యకే జరిమానా: శభాష్ అనిపించుకున్న ట్రాఫిక్ ఎస్సై!
, సోమవారం, 15 సెప్టెంబరు 2014 (14:53 IST)
ఉత్తరప్రదేశ్ పోలీసుల్లో చైతన్యం కలిగినట్లుంది. తరచూ అత్యాచారాలు, నేరాలు-ఘోరాలు జరిగే యూపీలో ఇక లాభం లేదనుకున్నారో ఏమో కానీ పోలీసులు చైతన్యవంతులయ్యారు. 
 
గత వారంలో 23 ఏళ్ల లేడీ కానిస్టేబుల్ అయిన సునీత.. అత్యాచారానికి గురికానున్న ఓ టీనేజ్ అమ్మాయిని రక్షించి, సీఎం అఖిలేష్ యాదవ్ వద్ద మన్ననలు పొందితే.. మరో ట్రాఫిక్ పోలీసు తన విధులను సమర్థవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్నాడు. 
 
ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసినప్పడు మనకు తెలిసినవారి పేరు చెప్పి చలానా కూకుండా తప్పించుకుంటూ ఉంటాం. ఐతే ఉత్తర ప్రదేశ్‌లో ఒక ట్రాఫిక్ పోలీస్ ఎస్సై మాత్రం రూల్స్ బ్రేక్ చేసినందుకుగాను తన భార్యకే జరిమానా వేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పట్టణంలోని మధుసూదన్ చౌదరి క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కంప్యూటర్ మరమ్మతు చేయించుకోవడానికి అతని భార్య ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చింది. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన భార్యను ఆపిన ట్రాఫిక్ ఎస్సై, ఆమె ద్విచక్రవాహనానికి నంబర్ ప్లేట్ కూడా విరిగిపోయినట్లు గుర్తించాడు.
 
రెండింటికీ కలిపి అతని భార్యకు జరిమానా రాసి శభాష్ అనిపించుకున్నాడు. దీనిపై ఎస్సై మాట్లాడుతూ సమాజంలో మార్పు అనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలని తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu