Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోలీసు అమరవీరులకు లేని ప్రాధాన్యత శక్తిమాన్‌కు ఎందుకు.. విగ్రహాన్ని తొలగించిన ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి చేతిలో దారుణానికి బలైన పోలీస్‌ గుర్రం శక్తిమాన్‌కు గుర్తుగా డెహ్రాడూన్‌లోని పోలీసు లైన్స్ ప్రాంతంలో శక్తిమాన్ విగ్రహాన్ని అధికారులు ప్రతిష్టించారు. అంతేకాకుండ

పోలీసు అమరవీరులకు లేని ప్రాధాన్యత శక్తిమాన్‌కు ఎందుకు.. విగ్రహాన్ని తొలగించిన ఉత్తరాఖండ్
, బుధవారం, 13 జులై 2016 (12:52 IST)
ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి చేతిలో దారుణానికి బలైన పోలీస్‌ గుర్రం శక్తిమాన్‌కు గుర్తుగా డెహ్రాడూన్‌లోని పోలీసు లైన్స్ ప్రాంతంలో శక్తిమాన్ విగ్రహాన్ని అధికారులు ప్రతిష్టించారు. అంతేకాకుండా శక్తిమాన్ జ్ఞాపకార్థం డెహ్రాడూన్ పోలీసులు పోలీసు లైన్స్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న పెట్రోల్ పంప్‌కు శక్తిమాన్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. పోలీస్ అశ్వ‌క ద‌ళంలో సేవ‌లందించిన‌ శక్తిమాన్ జ్ఞాపకాలు తమతో పదిలంగా ఉండాలన్న ఉద్దేశంతోనే పోలీసు లైన్స్‌లోని బ్యాడ్మింటన్ కోర్ట్ వద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేశామని డెహ్రాడూన్ పోలీసు అధికారి సదానంద్ డాటే తెలిపారు. 
 
కానీ ఇప్పుడు ఉత్తరాఖండ్ పోలీసులు గుర్రం శక్తిమాన్ స్మారక చిహ్నాన్ని ఉన్నట్టుంచి తొలగించారు. శక్తిమాన్ గుర్రం విగ్రహాన్ని ఆ బిజీ సెంటర్లో నిలబెట్టేందుకు పట్టినంత సమయం కూడా తొలగించడానికి కాలేదు. క్షణంలో ఆ విగ్రహాన్ని తొలగించేశారు. ఈ విషయమై ఆ రాష్ట్ర ప్రతిపక్షం బీజేపీ నేతల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. 
 
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ శక్తిమాన్ పేరును ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తూ దాని విగ్రహాన్ని ఏర్పాటుచేసిందని ఆరోపించింది. దానికితోడు ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు ఒక జ్ఞాపక చిహ్నం కూడా లేదు. చనిపోయిన పోలీసుల కన్నా ఒక గుర్రానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారనే విమర్శలు రావడంతో విగ్రహాన్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫీచర్లను ల్యాప్‌టాప్‌లో వాడుకోవాలా? సూపర్‌బుక్‌ ఉందిగా?