Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోషల్ మీడియాలో పరిచయం.. ప్రేయసి భర్తను చంపేందుకు కుట్ర.. విస్కీలో పురుగుల మందు కలిపి?

ప్రియురాలి కోసం ఆమె భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన చెన్నై ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వేలూరు జిల్లా సాత్తుమదురైకి చెందిన సతీష్‌కుమార్‌ (36)కు గత 28వ తేదీ కొరియరల్‌లో వ

సోషల్ మీడియాలో పరిచయం.. ప్రేయసి భర్తను చంపేందుకు కుట్ర.. విస్కీలో పురుగుల మందు కలిపి?
, సోమవారం, 7 నవంబరు 2016 (09:29 IST)
ప్రియురాలి కోసం ఆమె భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన చెన్నై ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వేలూరు జిల్లా సాత్తుమదురైకి చెందిన సతీష్‌కుమార్‌ (36)కు గత 28వ తేదీ కొరియరల్‌లో విస్కీ బాటిల్‌ వచ్చింది. అతను తన స్నేహితుడు వంసత్‌కుమార్‌(36)తో కలిసి 29వ తేదీ సేవించాడు. కొద్దిసేపటికి ఇద్దరు స్పృహ కోల్పోయారు. అటుగా వచ్చిన వారు అతనిని ఆస్పత్రిలో చేర్పించారు. 
 
సీఎంసీ ఆస్పత్రిలో వారిద్దరికీ చికిత్సలు అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తనకు వచ్చిన పార్సిల్‌లో వున్న విస్కీలో విషం కలిపిన విషయం తెలియక సేవించినట్టు తెలియడంతో ఆ పార్సిల్‌ను పంపిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా వుండగా, పార్సిల్‌పై రాసి వున్న చిరునామా నకిలీగా వున్నట్టు తెలిసింది. అంతేగాకుండా సతీష్‌ కుమార్‌ భార్య గౌతమి(30)పై అనుమానం చెందిన పోలీసులు ఆమె ఫోన్‌ను పరిశీలించగా వినాయకమూర్తి వద్ద నుంచి ఎక్కువసార్లు కాల్‌ వచ్చినట్టు గుర్తించారు. 
 
అనంతరం వినాయకమూర్తిని ఆదివారం అరెస్టు చేసిన పోలీసులు జరిపిన విచారణలో... వేలూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అతను పాల్గొన్నాడని, అప్పుడు గౌతమితో ఏర్పడిన పరిచయం ఆమెపై ప్రేమ కలిగేలా చేసిందని తెలిసింది. గత ఆరు నెలలుగా ఫోన్లు, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ద్వారా తరచు మాట్లాడుకునేవారిమని, ఆమెపై ఏర్పడిన ప్రేమతో భర్తను వదిలి తన వద్దకు వచ్చేయమని కోరితే ఆమె ఒప్పుకోకపోవడంతో భర్తను హత్య చేసేందుకు విస్కీలో పురుగుల మందు కలిపి పార్సిల్‌ పంపినట్టు అంగీకరించాడు. పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరుణ గ్రహంపై అద్భుతం : పొడవైన జుట్టు.. గౌను వేసుకున్న మహిళ.. క్యూరియాసిటీ రోవర్ ఫోటో