Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రజనీకి మోడీ జన్మదిన శుభాకాంక్షలు.. ప్రశంసల జల్లు..!

రజనీకి మోడీ జన్మదిన శుభాకాంక్షలు.. ప్రశంసల జల్లు..!
, శుక్రవారం, 12 డిశెంబరు 2014 (09:55 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు  జీవించాలని మోడీ ఆకాంక్షించారు. 
 
రజనీకాంత్ భారత చలన చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తి అని మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. శుక్రవారం రజనీకాంత్ 63వ జన్మదినోత్సవం. ఆయన నటించిన లింగ ప్రపంచవ్యాప్తంగా 2400 థియేటర్లలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
 
అలాగే కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్కు కూడా ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  మోదీ శుక్రవారం రజనీ,శరద్ పవార్లకు ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల శరద్ పవార్ ఇంట్లో జారి పడి... కాలికి ముంబైలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం శరద్ పవార్ ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu