Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నన్ను తీసుకెళ్తే వచ్చేస్తా.. ఆయనతో కలిసి..?: మోడీ భార్య

నన్ను తీసుకెళ్తే వచ్చేస్తా.. ఆయనతో కలిసి..?: మోడీ భార్య
, శుక్రవారం, 21 నవంబరు 2014 (19:30 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సతీమణి జశోదాబెన్ ఆయనతో కలిసి జీవించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తద్వారా మోడీ జీవితంలో మళ్లీ వసంతం వస్తుందా? మోడువారిన వైవాహిక జీవితం మళ్లీ చిగురుస్తుందా అనేది కాలంతో పాటు మోడీ చేతుల్లోనే ఉంది. 
 
ప్రస్తుతం, గుజరాత్ మెహ్సానా జిల్లాలోని ఈశ్వర్ వాడ గ్రామంలో తన ఇద్దరు సోదరులతో కలిసి జశోదా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఇటీవలే ఆమెకు ఎస్పీజీ రక్షణ కల్పించారు.
 
తాజాగా మోడీతో విడిపోయి వేరుగా ఉంటున్న భార్య జశోదాబెన్ ఇప్పుడు సానుకూల సంకేతాలు పంపుతున్నారు. భర్తతో కలిసి జీవించేందుకు తాను సిద్ధమేనంటున్నారు. ఇన్నాళ్ల నిశ్శబ్దాన్ని వీడి మీడియాతో తన కాపురంపై మాట్లాడారు. తనను తీసుకెళ్లడానికి ఆయనొస్తే వెళ్లేందుకు తనకు అభ్యంతరం లేదని జశోదా స్పష్టం చేశారు. 
 
మోడీకి వివాహం అయిందన్న సంగతి వడోదర లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసే సమయంలో వెల్లడైంది. 1968లో టీనేజర్లుగా ఉన్నప్పుడు మోడీ, జశోదాలకు వివాహమైంది. అనంతరం కొంతకాలానికి వారు విడిపోయారు. రాజకీయాలతో మోడీ, ఉపాధ్యాయురాలిగా ఆమె తమ ఒంటరి ప్రస్థానం కొనసాగించారు.

Share this Story:

Follow Webdunia telugu