Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం!
, సోమవారం, 24 నవంబరు 2014 (09:50 IST)
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు వచ్చే నెల 23వ తేదీ వరకు అంటే మొత్తం 22 రోజుల పాటు జరిగే సమావేశాల్లో 37 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఇందులో కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో అధికార బీజేపీ అడుగులు వేస్తోంది. అయితే, ప్రభుత్వ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రతిపక్షాలు తమ వాదనలకు పదును పెడుతున్నాయి. 
 
ముఖ్యంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, బీమా బిల్లు, భూసేకరణ సవరణ బిల్లు తదితర ముఖ్య బిల్లుల సవరణ విషయంలో ఏమాత్రం రాజీ పడరాదని కాంగ్రెస్ పార్టీ సహా పలు విపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం అన్ని విపక్ష పార్టీలు ఐక్యం కావాలని నిర్ణయించాయి. 
 
అయితే, దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించనున్న బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు కూడా తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ప్రతి అంశంపైనా చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని, సభను సజావుగా నిర్వహించేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu