Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో పెరుగుతున్న మూర్ఛరోగులు : డాక్టర్ దినేష్ నాయక్

దేశంలో మూర్ఛరోగుల సంఖ్య పెరుగుతోందని, దీనికి కారణంగా ఈ వ్యాధికి చికిత్స చేసేందుకు అధునాత వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిపై అవగాహన లేకపోవడమేనని ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి న్యూరాలజీ, ఎపిలెప్సి విభాగ అధ

Advertiesment
Fortis Malar Hospital Comprehensive Epilepsy Centre
, సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (09:47 IST)
దేశంలో మూర్ఛరోగుల సంఖ్య పెరుగుతోందని, దీనికి కారణంగా ఈ వ్యాధికి చికిత్స చేసేందుకు అధునాత వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిపై అవగాహన లేకపోవడమేనని ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి న్యూరాలజీ, ఎపిలెప్సి విభాగ అధిపతి డాక్టర్ దినేష్ నాయక్ అన్నారు. ఆ ఆస్పత్రిలో మూర్ఛరోగ సహాయక బృందం విభాగాన్ని తొలిసారి ఏర్పాటు చేసింది. ఈ విభాగం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ ఆరోగ్యం సంస్థ నివేదిక మేరకు భారత్‌లో 12 మిలియన్‌ల మంది మూర్ఛరోగ నిపుణులు ఉన్నారని చెప్పారు. ఇది ప్రపంచంలో ఐదో వంతు అని వెల్లడించారు.
 
వాస్తవంగా మూర్ఛ రోగానికి తగిన చికిత్స ఉందన్నారు. కానీ, దీనిపై చాలా మంది సరైన అవగాహన లేదన్నారు. దేశంలో ఉన్న మూర్ఛరోగుల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్న రోగుల్లో సగటున 60 శాతం మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారని ఆయన వివరించారు. దీనికి ప్రధాన కారణం సరైన అవగాహన లేకపోవడమేనని ఆయన గుర్తు చేశారు.
 
ఇకపోతే.. ఫోర్టిస్ మలర్ ఆస్పత్రిలో ప్రారంభించిన మూర్ఛరోగ సహాయక బృందంపై ఆయన స్పందిస్తూ... ఈ బృందం ఆస్పత్రిలో చికిత్స పొందే, చికిత్స కోసం వచ్చే మూర్ఛరోగులతో పాటు.. వారి కుటుంబ సభ్యుల్లో సరైన అవగాహన కల్పించడమే ప్రధాన విధి అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎపిలెప్సి విభాగానికి చెందిన పలువురు మాజీ ప్రొఫెసర్లు, వైద్యులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజూ ఓ అరటి పండు తినండి... ఆరోగ్యంగా ఉండండి..