Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీరనారి... మొసలితో పోరాటం... ఎక్కడ?

వీరనారి... మొసలితో పోరాటం... ఎక్కడ?
, శనివారం, 1 ఆగస్టు 2015 (21:21 IST)
ఆమె మొసలితో పోరాటం చేసింది. మరోవైపు మొసలి ఆమెను వాగులోకి లాక్కెళ్ళేందుకు సర్వ ప్రయత్నం చేసింది. సాహసోపేతంగా పోరాటం చేసిన మహిళ దెబ్బకు చివరకు మొసలే తోక ముడిచింది. ఒడిశాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
ఒడిశా కేంద్రపారాలోని సింగిరి గ్రామంలో సాబిత్రీ సమాల్ అనే 37 ఏళ్ల మహిళ వాగు సమీపంలో ఉన్న తన ఇంట్లో వంటగిన్నెలు కడుగుతోంది. ఆ సమయంలో ఓ పెద్ద మొసలి సాబిత్రిపై దాడి చేసింది. గతంలో ఎన్నడూ పరిసర ప్రాంతాల్లో మొసలిని చూడని ఆమె తొలుత షాక్ అయింది. వెంటనే తేరుకుని తన చేతిలో ఉన్న అల్యూమినియం గిన్నె, వంట కర్రతో మొసలిని ధైర్యంగా ఎదుర్కొంది. 
 
అయినా సాబిత్రిని వాగుదాకా లక్కుపోయి నంజుకుతినేందుకు మొసలి తీవ్రంగా యత్నించింది. ధైర్యం కోల్పోని ఆమె తన చేతిలో ఉన్న గిన్నెతో మొసలి కన్ను, నుదురుపై బాదింది. చివరకు సాబిత్రి స్థైర్యాన్ని చూసి మొసలి వెనక్కు తగ్గింది. స్వల్పంగా గాయపడిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటోంది. 

Share this Story:

Follow Webdunia telugu