Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒబామాకు మోడీ సూపర్ గిప్ట్స్: సౌదీకి పయనం!

ఒబామాకు మోడీ సూపర్ గిప్ట్స్: సౌదీకి పయనం!
, మంగళవారం, 27 జనవరి 2015 (19:06 IST)
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూపర్ గిఫ్ట్ అందజేశారు. ఇంతవరకూ ఒబామాకు ఎరుగని తీపి కానుకలను మోడీ ఇచ్చారు. ఒబామాకు ఇచ్చిన బహుమతుల వివరాలను మోడీ సోషల్ మీడియాలో వెల్లడించారు. 
 
1957లో భారత పర్యటనకు వచ్చిన అమెరికన్ సింగర్ మరియన్ ఆండర్సన్ ఇక్కడ పాడిన గీతాల రికార్డులను మోడీ స్వయంగా ఒబామాకు అందించారు. ఆ సమయంలో ఆకాశవాణిలో ప్రసారం అయిన ఆండర్సన్ ఇంటర్వ్యూ, గాంధీ స్మారకార్థం ఆయన పాడిన 'లీడ్ కైండ్లీ లైట్' గీతం రికార్డు కూడా బహుమతిగా ఇచ్చారు. 
 
అమెరికా నుంచి తొలిసారి ఇండియాకు వచ్చిన టెలిగ్రామ్ ఒరిజినల్ కాపీ ఆయనకు అందించినట్టు పేర్కొన్నారు. వీటితో పాటు 1950 జనవరి 26న విడుదలైన స్టాంప్, విలువైన చీరలు, పలు బహుమతులను ఒబామా తన వెంట తీసుకువెళ్లారు.
 
ఇకపోతే.. బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ నుంచి సౌదీకి పయనమయ్యారు. అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోడీ, అధికారులు వీడ్కోలు పలికారు. 
 
కాగా, ఎయిర్ ఫోర్స్ వన్ విమానం లోపలికి ప్రవేశించే ముందు ఒబామా, ఆయన అర్ధాంగి మిషెల్ భారత వర్గాలకు సంప్రదాయబద్ధంగా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపి, నిష్క్రమించారు. ఒబామా ఇటీవల మరణించిన సౌదీ రాజు అంత్యక్రియల్లో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu