Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదు : కేంద్ర హోంశాఖ

పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదు : కేంద్ర హోంశాఖ
, సోమవారం, 1 సెప్టెంబరు 2014 (13:18 IST)
పాకిస్థాన్‌తో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చలు జరుపనున్నట్టు వస్తున్న వార్తలను కేంద్ర హోంశాఖ కొట్టిపారేసింది. ఇదే అంశంపై కేంద్ర హోంశాక కార్యాలయం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. 
 
పలుమార్లు భారత సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ, తీరు మార్చుకోని పాకిస్థాన్ విషయంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. వచ్చే నెలలో నేపాల్‌లో సార్క్ దేశాల సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా పాకిస్థాన్‌తో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చర్చలు జరపబోతున్నారంటూ వస్తున్న వార్తలను హోంమంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది.  
 
ఈ మేరకు ఆ శాఖ కార్యాలయం ట్వీట్ చేసింది. 'పాక్ తీవ్రవాదాన్ని ఆపనంతవరకు ఎలాంటి చర్చలు సాధ్యం కావు' అని పేర్కొంది. కాగా, సెప్టెంబర్ 18, 19న నేపాల్లో జరగనున్న సార్క్ సమావేశాలకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. కాగా, పాకిస్థాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాలని భారత ఆర్మీ బలగాలను హోంశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu