Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాట్సాప్‌ నిషేధానికి సుప్రీం కోర్టు నో.. ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సిందిగా సూచన!

అత్యాధునిక మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను నిషేధించేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మనదేశ భద్రతకి ముప్పు ఉందని అందుకే వాట్సాప్‌ని భారతదేశం నుండి బ్యాన్ చేయాలని హర్యానాకు చెందిన సుధీర్ యాదవ్ సుప

వాట్సాప్‌ నిషేధానికి సుప్రీం కోర్టు నో.. ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సిందిగా సూచన!
, బుధవారం, 29 జూన్ 2016 (15:04 IST)
అత్యాధునిక మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను నిషేధించేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మనదేశ భద్రతకి ముప్పు ఉందని అందుకే వాట్సాప్‌ని భారతదేశం నుండి బ్యాన్ చేయాలని హర్యానాకు చెందిన సుధీర్ యాదవ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. వాట్సాప్‌పై ఏదైనా చర్య తీసుకోవాలంటే ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని సూచించింది. 
 
కాగా.. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885 నిబంధనలను వాట్సాప్, తదితర మెసెంజర్ సర్వీసులు ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ ఆరోపించారు. మనదేశంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో 90% మందికి పైగా వాట్సాప్ అప్లికేషన్ వాడుతున్నారు. అసలు విషయానికొస్తే.. గత ఏప్రిల్ నుండి వాట్సాప్, తమ వినియోగదారుల మెసేజ్‌లను ‌256 బిట్ ఎన్క్రిప్షన్‌తో పంపుతుంది. 
 
ఈ విధానం ద్వారా ఒకసారి ఎన్క్రిప్ట్ అయిన మెసేజ్‌లను ఎవరికి పంపారో వారు తప్ప ఇంకెవరు డీక్రిప్ట్ చేయలేరు. హ్యాక్ చేసి చదవలేరు. ఈ విధానం వలన సంఘవిద్రోహ శక్తులు తమ తమ ప్లాన్లను నిఘా సంస్థలకు తెలియకుండా వాట్సాప్‌లో పంపించుకునే అవకాశం ఉందని, ఒకవేళ తీవ్రవాదులు వాట్సాప్ వాడుతున్నారని తెలిసినా మన పోలీసులు ఏమీ చేయలేరని, దీనివల్ల దేశ భద్రతకు భారీ ముప్పు పొంచి ఉన్నదని సుధీర్ యాదవ్ వాదించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణా పుష్కరాల్లోపే.. విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి కువైట్‌కు ఫ్లైట్ సర్వీసులు!