Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిత్యానంద కేసు... ఆడియో పరీక్షలకై ఎపి సాయం కోరిన కర్ణాటక

నిత్యానంద కేసు... ఆడియో పరీక్షలకై ఎపి సాయం కోరిన కర్ణాటక
, శుక్రవారం, 28 నవంబరు 2014 (10:44 IST)
వివాదాస్పద స్వామి నిత్యానంద కేసులో ఆడియో పరీక్షల నిమిత్తం కర్ణాటక నేర పరిశోధక శాఖ ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీని సాయం కోరింది. ఈ కేసులో టెలిఫోన్ సంభాషణలు, వీడియో చిత్రాలే ప్రధాన ఆధారాలుగా ఉండడంతో అవి ఎంత వరకు నిజమైనవనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఆ పని చేసింది. ఈ మేరకు కర్ణాటక పోలీసులు డిజిపికి విజ్ఞప్తి పంపించారని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు సైతం పంపినట్టు ఎపిఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఎ శారద తెలిపారు. 
 
తమ వద్ద అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం ఉందని, ఆడియో - వీడియో నిర్ధారణకు అవసరమైన సాధికారికమైన సాఫ్ట్‌వేర్ ఉందని శారద చెప్పారు. నిత్యానంద గొంతు నమూనా తమకు అవసరమని, ఇందులో ఇతర విషయాలు కూడా ఇమిడి ఉన్నాయని, వారిని తమ ల్యాబ్‌కు రావాల్సిందిగా అడిగామని, వారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని శారద వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, వివాదాస్పద నిత్యానంద స్వామి పురుషుడేనని తేలింది. ఆయనకు నిర్వహించిన లైంగిక సామర్థ్య పరీక్షలలో ఈ మేరకు వెల్లడైందని సీఐడీ అధికారులు వెల్లడించారు. సీఐడీ డీఎస్పీ లోకేశ్‌ నేతృత్వంలోని పోలీసు బృందం ఈ మేరకు వైదుల ధ్రువీకరణ పత్రాలతో కూడిన నివేదికను రామనగర్‌లోని సెషన్స్‌ కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu