Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనంది బెన్... త‌ర్వాత ఇక ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం రాధార‌మ‌ణ్ సింగ్ వంతే...?!

న్యూఢిల్లీ : బీజేపీ అధిష్ఠానం వ‌రుస‌గా ముఖ్య‌మంత్రుల‌ను మార్చే కార్య‌క్ర‌మంలో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. నిన్న గుజ‌రాత్ సీఎం ఆనంది బెన్ ప‌క్క‌కు త‌ప్పుకోగా, ఇపుడు తాజాగా మరో బిజెపి ముఖ్యమంత్రిపై వేటుపడే ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. ఇప్పటికే గుజరాత్ ముఖ్యమం

అనంది బెన్... త‌ర్వాత ఇక ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం రాధార‌మ‌ణ్ సింగ్ వంతే...?!
, శుక్రవారం, 5 ఆగస్టు 2016 (12:06 IST)
న్యూఢిల్లీ : బీజేపీ అధిష్ఠానం వ‌రుస‌గా ముఖ్య‌మంత్రుల‌ను మార్చే కార్య‌క్ర‌మంలో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. నిన్న గుజ‌రాత్ సీఎం ఆనంది బెన్ ప‌క్క‌కు త‌ప్పుకోగా, ఇపుడు తాజాగా మరో బిజెపి ముఖ్యమంత్రిపై వేటుపడే ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. ఇప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్‌ను పదవి నుంచి తప్పించిన పార్టీ అధిష్ఠానం ఇప్పుడు చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పైన దృష్టి సారించిందని తెలుస్తోంది. దానికితోడు రమణ్ సింగ్ ఆకస్మికంగా ఢిల్లీ బయల్దేరి వెళ్లడం కూడా అనేక ఊహాగానాలకు తెరదీసింది. 
 
గత రెండేళ్లుగా రమణ్ సింగ్ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ నాయకత్వం రమణ్ సింగ్ ప్రభుత్వ తీరుపై అంత సంతృప్తికరంగా లేదు. ఢిల్లీలో బిజెపి కేంద్ర నాయకత్వం, ఆర్ఎస్ఎస్ సంయుక్త సమావేశం జరుగుతోందని, అందులో రమణ్ సింగ్ ప్రభుత్వ తీరుపై కూడా చర్చించవచ్చని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రమణ్ సింగ్ ముఖ్యమంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా అన్న చర్చ ఛ‌త్తీస్‌గడ్‌లో జరుగుతోంది.
 
మూడోసారి వరుసగా ఎన్నికైన రమణ్ సింగ్ ప్రభుత్వం 2018లో ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంది. ఈ త‌రుణంలో సీఎంను త‌ప్పించ‌డం బీజేపికి క‌లిసివచ్చే అంశ‌మేన‌ని స్థానిక బీజేపీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అయితే స‌మ‌ర్థుడైన మ‌రో అభ్య‌ర్థిని రంగంలోకి దింపాల‌ని చెపుతున్నారు. లేక‌పోతే ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవ‌డం క‌ష్ట‌మ‌ని విశ్లేషిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానంలో మంటలు.. ల్యాప్ టాప్, బ్యాగులపై వెంపర్లాడిన భారత ప్రయాణీకులు ఎక్కడ? (Video)