Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తరాఖండ్ కార్చిచ్చు... షాకాజ్‌ నోటీసులు జారీ చేసిన ఎన్జీటీ

ఉత్తరాఖండ్ కార్చిచ్చు... షాకాజ్‌ నోటీసులు జారీ చేసిన ఎన్జీటీ
, బుధవారం, 4 మే 2016 (10:18 IST)
ఉత్తరాఖండ్ కార్చిచ్చుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. ఉత్తరాఖండ్‌, హిమాచల ప్రదేశ్‌లకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌ నేతృత్వంలోని బెంచ్‌ నోటీసులు జారీ చేసింది. కొన్ని రోజులుగా ఆ రాష్ట్రాల్లోని అడవుల్లో వ్యాపిస్తున్న మంటల్ని అదుపు చేయడానికి ఏమి చర్యలు తీసుకున్నారో తెలపాలని పర్యావరణ, అటవీ శాఖను ఆదేశించింది. 
 
ఈ విషయాన్ని అంతా చాలా సాధారణంగా తీసుకుంటున్నారని అది తమను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసిందని బెంచ్‌ వ్యాఖ్యానించింది. కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లో ప్రారంభమైన ఈ అటవీ మంటలు హిమాచల ప్రదేశ్‌ రాష్ట్రానికి వ్యాపించిన విషయం తెల్సిందే. ఈ మంటలను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తీవ్రంగా శ్రమించి ఆర్పి వేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పశ్చిమ్‌బంగాలో ముగిసిన ఎన్నికల ప్రచారం .. 5న చివరి విడత ప్రచారం