Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పేరుకు స్పా సెంటర్.. లోపల వ్యభిచారం.. కాలేజీ అమ్మాయిలతో సెక్స్ రాకెట్

బయట స్పా సెంటర్ బోర్డు.. లోపల వ్యభిచారం. కాలేజీ అమ్మాయిల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా సెక్స్ రాకెట్ నడుపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఇది వెలుగు చూసింది. ఈ వివరాల

పేరుకు స్పా సెంటర్.. లోపల వ్యభిచారం.. కాలేజీ అమ్మాయిలతో సెక్స్ రాకెట్
, శుక్రవారం, 26 మే 2017 (09:49 IST)
బయట స్పా సెంటర్ బోర్డు.. లోపల వ్యభిచారం. కాలేజీ అమ్మాయిల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా సెక్స్ రాకెట్ నడుపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఇది వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మహారాష్ట్ర నాసిక్‌లోని గంగాపూర్‌ రోడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హెచ్‌పీటీ కాలేజీ రోడ్డులో స్పా పేరుతో వ్యభిచారం గృహాన్ని నడుపుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో రాత్రి సమయంలో స్పా సెంటర్‌పై కస్టమర్లుగా పోలీసులు వెళ్లి, లోపల వ్యభిచారం జరుగుతున్నట్టు నిర్ధారించుకున్నారు. 
 
దీంతో స్పాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 8 మంది యువతులతో పాటు ఐదుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం షరతులతో వారిని విడిచిపెట్టినట్లు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జి మహేష్‌ దేవికర్‌ తెలిపారు. పరారీలో ఉన్న స్పా యజమాని పరేష్‌సురానాపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అమ్మాయిలు పక్కలోకి పనికొస్తార'న్న చలపాయ్ వ్యాఖ్యలకు వత్తాసు.. యాంకర్ రవిపై కేసు