Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్దా నదిలో బోల్తాపడిన పడవ - 11 మంది గల్లంతు

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (17:51 IST)
Boat
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ జిల్లాలోని గాలేగావ్‌ సమీపంలో వార్దా నదిలో ఓ పడవ బోల్తా పడింది. దీంతో ఈ పడవలో ప్రయాణిస్తున్న 11 మంది గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 
 
ప్రమాద సమయంలో ఆ పడవలో 30కి పైగా మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పడవ మునిగిపోవడాన్ని గుర్తించిన స్థానికులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
 
అధికారులకు సమాచారం అందించారు. పడవలోని 11 మంది గల్లంతుకాగా ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. అధిక బరువు కారణంగానే పడవ మునిగిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments