Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై మోడల్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో బాయ్‌ఫ్రెండే..?!

ముంబై మోడల్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో బాయ్‌ఫ్రెండే..?!
, బుధవారం, 1 అక్టోబరు 2014 (18:31 IST)
ముంబైలోని వెర్సోవాలో ఓ మోడల్ ఆత్మహత్య చేసుకుంది. అర్చనా పాండే అనే మోడల్ వెర్సోవాలో ఓ ఫ్లాట్ లో అద్దెకు ఉంటోంది. ఆమె ఫ్లాట్ నుంచి దుర్వాసన వెలువడడంతో ఇరుగు పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆమె ఫ్లాట్ తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. 
 
అర్చనా పాండే ఆత్మహత్య చేసుకుని పడిఉండడం గమనించిన పోలీసులకు ఆమె సూసైడ్ నోట్ దొరికింది. అందులో తన ఆత్మహత్యకు కారణం తన బాయ్ ఫ్రెండ్ ఓమర్ పఠాన్ అని ఆమె పేర్కొంది. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu