Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాయ్ ఫ్రెండ్సే రేపిస్ట్‌లు... అమ్మాయిలూ జాగ్రత్త...! కమిషనర్ అలెర్ట్..

బాయ్ ఫ్రెండ్సే రేపిస్ట్‌లు... అమ్మాయిలూ జాగ్రత్త...! కమిషనర్ అలెర్ట్..
, శనివారం, 29 నవంబరు 2014 (11:32 IST)
నిజంగా బాయ్ ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలకి చాలా విశ్వాసం. ఐతే ఆ నమ్మకం చాలా దారుణంగా వమ్మవుతోందని తాజాగా విడుదలైన గణాంకాలు తెలుపుతున్నాయి. ముంబై మహా నగరంలో బాయ్ ఫ్రెండ్స్ చేతిలో అత్యాచారానికి గురవుతున్న అమ్మాయిల సంఖ్య పెరిగిపోతోందని ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా లెక్కలతో సహా చూపిస్తూ చెప్పారు. 
 
ఈ విషయమై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ... మంచి మాటలతో అమ్మాయిలను నమ్మించి, వారిని లొంగదీసుకుని, అనంతరం వారిపై అత్యాచారానికి పాల్పడి, చివరికి తమకేమీ తెలియనట్టు చేతులు దులుముకునే మోసగాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. కనుక అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌తో జర జాగ్రతగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
 
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెల వరకు 542 అత్యాచార ఘటనలు చోటు చేసుకోగా, వాటిలో 389 కేసులు బాయ్ఫ్రెండ్ చేతిలోనే యువతులు అత్యాచారానికి గురైయ్యారని చెప్పారు. బాయ్ఫ్రెండ్లు చెప్పే మాయ మాటలను యువతలు వెంటనే నమ్మడం వల్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని రాకేశ్ మారియా విశ్లేషించారు. 
 
కాగా మరో ఆరు శాతం మంది యువతులు ఆగంతకుల చేతిలో అత్యాచారానికి గురైయ్యారని తెలిపారు. మిగిలిన యువతులు మాత్రం బంధువులు లేక పరిచయస్థుల చేతిలో అత్యాచారానికి గురైనవారని ఆయన చెప్పారు. అయితే మొత్తం 542 అత్యాచార కేసుల్లో ఇప్పటివరకు 477 కేసులను ఛేదించినట్లు  రాకేశ్ మారియా వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu