Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోనియా కలర్‌పై కామెంట్‌ : గిరిరాజ్ సింగ్ క్షమాపణ!

సోనియా కలర్‌పై కామెంట్‌ : గిరిరాజ్ సింగ్ క్షమాపణ!
, సోమవారం, 20 ఏప్రియల్ 2015 (13:18 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కలర్‌పై కామెంట్ చేసిన కేంద్ర సహాయమంత్రి గిరిరాజ్ సింగ్ క్షమాపణ చెప్పారు. ఎవరినీ బాధపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని లోక్ సభలో వివరణ ఇచ్చారు. ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరి భావాలనైనా బాధపెట్టి ఉంటే తాను విచారం వ్యక్తం చేస్తున్నానని గిరిరాజ్ తెలిపారు. దాంతో ఈ వివాదం ముగిసింది. 
 
ఈ నెల మొదట్లో మీడియాతో మాట్లాడిన గిరిరాజ్, "ఒకవేళ రాజీవ్ గాంధీ తెల్లతోలు మహిళను (సోనియాగాంధీ) కాకుండా నైజీరియన్ మహిళను వివాహం చేసుకుని ఉంటే ఆమె నాయకత్వాన్ని కాంగ్రెస్ అంగీకరించేదా?" అని వ్యాఖ్యానించారు.
 
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. సోమవారం లోక్ సభలో కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసి సోనియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో దిగివచ్చిన గిరిరాజ్ సింగ్ సోనియాకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu