Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండిగో విమానంలో దుస్తులిప్పేసి నానా హంగామా చేశాడు.. అరెస్ట్ అయ్యాడు..

ఇండిగో విమానంలో ఓ ప్రయాణీకుడు నీచంగా ప్రవర్తించాడు. ప్రయాణంలో ఉండగానే బాత్రూమ్‌లోకి వెళ్లి అక్కడ దుస్తులు మొత్తం విప్పేసి నానా హంగామా సృష్టించాడు. తొలుత విమానం ఎక్కి సీటులో కూర్చోగానే తనకు సీటుబెల్టు

ఇండిగో విమానంలో దుస్తులిప్పేసి నానా హంగామా చేశాడు.. అరెస్ట్ అయ్యాడు..
, బుధవారం, 12 అక్టోబరు 2016 (10:28 IST)
ఇండిగో విమానంలో ఓ ప్రయాణీకుడు నీచంగా ప్రవర్తించాడు. ప్రయాణంలో ఉండగానే బాత్రూమ్‌లోకి వెళ్లి అక్కడ దుస్తులు మొత్తం విప్పేసి నానా హంగామా సృష్టించాడు. తొలుత విమానం ఎక్కి సీటులో కూర్చోగానే తనకు సీటుబెల్టు కట్టుకోవడం ఎలాగో తెలియదని సీన్ చేశాడు.

దాంతో విమాన సిబ్బంది ఆ విషయంలో అతడికి సాయం చేశారు. తర్వాత అతడు బాత్రూంకు వెళ్లి.. అక్కడ ఉన్న కాల్ బెల్ కొట్టి, సాయం కావాలని సిబ్బందిని పిలిచాడు. వెంటనే సిబ్బంది అక్కడకు వెళ్లి చూడగా.. అతడు దుస్తులన్నీ విప్పేసి అభ్యంతరకర పరిస్థితిలో కనిపించాడు. 
 
దాంతో లోపలకు వెళ్లేందుకు నిరాకరించిన మహిళా సిబ్బంది.. అతడిని కాస్త గౌరవప్రదంగా ప్రవర్తించాలని క్లాజ్ పీకారు. ఆ తర్వాత ఎలాగోలా బయటకు వచ్చేశాడు. ఆపై దుష్ప్రవర్తన మానుకోలేదు. ప్రయాణీకులంతా విమానం నుంచి దిగేటప్పుడు మహిళా సిబ్బందిపై అతడు దారుణమైన వ్యాఖ్యలు చేశాడు.

దాంతో విమాన కెప్టెన్‌కు సిబ్బంది ఈ విషయం వెల్లడించగా, కెప్టెన్ వెంటనే ఢిల్లీలోని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. సదరు ప్రయాణికుడు కిందకు దిగగానే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిపై ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్పత్రిలో అమ్మ.. పన్నీర్ సెల్వంకు శాఖల బదలాయింపు.. జయమ్మ పనులు ఓపీ చేస్తారు..