Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసిస్టెంట్ ప్రొఫెసర్ హత్య-అత్యాచారం కేసు: నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోవై కోర్టు

అసిస్టెంట్ మహిళా ప్రొఫెసర్‌ను హత్య చేసి.. ఆపై లైంగిక దాడి కేసులో కోయంబత్తూరు కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి కోర్టు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

అసిస్టెంట్ ప్రొఫెసర్ హత్య-అత్యాచారం కేసు: నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోవై కోర్టు
, గురువారం, 29 సెప్టెంబరు 2016 (13:45 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతూనే ఉన్నాయి. నేరాలు ఏమాత్రం తగ్గట్లేదు. మహిళలపై హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవట్లేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు చట్టంలో సవరణలు చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కానీ కోర్టులు నిందితులను కఠినంగా శిక్షిస్తేనే.. మహిళలపై దురాగతాలకు పాల్పడే వారి సంఖ్య తగ్గుతుందని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ మహిళా ప్రొఫెసర్‌ను హత్య చేసి.. ఆపై లైంగిక దాడి కేసులో కోయంబత్తూరు కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి కోర్టు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరునల్వేలి జిల్లా తెన్ కాశీకి చెందిన మహేష్ (30) అనే శాడిస్టుకు కోర్టు ఉరి శిక్ష విధించింది. కోయంబత్తూరు జిల్లా కారమడై సమీపంలోని అశిరియర్ కాలనీలో రమ్య (24) అనే యువతి నివాసం ఉంటోంది. ఆమె ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. 2014 నవంబర్ 30వ తేదీ సాయంత్రం కాలేజీ ముగించుకుని ఇంటికొస్తుండగా, మహేష్ ఆమె వెంటపడ్డాడు. భయంతో ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. 
 
కానీ గడేసేలోపే ఇంట్లోకి చొరబడిన మహేష్.. ముందు రమ్య, ఆమె తల్లి మాలతీలపై కర్రతో దాడి చేశారు. ఇద్దరు స్పృహ తప్పిపడిపోవడంతో.. ఇంట్లోని నగల్ని, నగదును దోచుకున్నాడు. అప్పటికే మహేష్ చేతిలో దాడికి గురైన రమ్యపై అత్యాచారం చేసి పారిపోయాడు. ఈ ఘటనపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. 2015 జనవరిలో మహేష్‌ను అరెస్టు చేశారు. కోర్టు విచారణలో అతడే నిందితుడని తేలింది. దీంతో కోర్టు మహేష్‌కు ఉరిశిక్ష విధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#ModiPunishesPak, ప్రపంచం అదే కావాలంటుందా...? పాకిస్తాన్ గతి అధోగతేనా...?