Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నోర్మూసుకోండి (షటప్‌).. లేదంటే బయటికి గెంటివేయిస్తా’.. ఇదేమైనా చేపల మార్కెట్టా : చీఫ్ జస్టీస్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోర్టుల్లో న్యాయవాదులు వాదనలు మాత్రమే వినిపించాలి. గట్టిగా వాదులాడుకోకూడదు. ఇది ప్రాథమిక సూత్రం. కానీ... సాక్షాత్తూ సుప్రీంకో

'నోర్మూసుకోండి (షటప్‌).. లేదంటే బయటికి గెంటివేయిస్తా’.. ఇదేమైనా చేపల మార్కెట్టా : చీఫ్ జస్టీస్
, శనివారం, 22 అక్టోబరు 2016 (09:38 IST)
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోర్టుల్లో న్యాయవాదులు వాదనలు మాత్రమే వినిపించాలి. గట్టిగా వాదులాడుకోకూడదు. ఇది ప్రాథమిక సూత్రం. కానీ... సాక్షాత్తూ సుప్రీంకోర్టులో, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ ముందే ఇద్దరు లాయర్లు గట్టిగా అరుచుకున్నారు. దీంతో... జస్టిస్‌ ఠాకూర్‌కు సహనం నశించింది. 
 
'నోర్మూసుకోండి (షటప్‌). లేదంటే బయటికి గెంటివేయిస్తా' అని హెచ్చరించారు. 'ఎందుకలా అరుస్తున్నారు? ఇది కోర్టా చేపల మార్కెట్టా? కోర్టులో హుందాగా వ్యవహరించాలి. కోర్టు హాలులో పద్ధతిగా నడుచుకోలేని వారంతా సీనియర్‌ లాయర్లు కావాలనుకుంటున్నారు! ఇదే అసలు సమస్య' అని వ్యాఖ్యానించారు. 
 
మరోసారి గొంతు పెంచి మాట్లాడొద్దని గట్టిగా కేకలు వేసిన ఒక న్యాయవాదిని ఉద్దేశించి హెచ్చరించారు. 'మాట్లాడొద్దు! మీరు ఈ కేసులో భాగస్వామి కాదు. సీనియర్‌ న్యాయవాది సొలీ సొరాబ్జీని చూసి, ఆయన నుంచి కొంత నేర్చుకోవడానికి ప్రయత్నించండి. గట్టిగా అరుస్తూ, చిటపటలాడితే మేలు జరుగుతుందనుకుంటున్నారా?' అని జస్టిస్‌ ఠాకూర్‌ ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెస్ట్‌ బెంగాల్‌లో వింత : యువకుడి కడుపులో మహిళా అవయవాలు