Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్‌బాస్ కోసం కుమార్ విశ్వాస్‌కు రూ.5 కోట్ల ఆఫర్?

బిగ్‌బాస్ కోసం కుమార్ విశ్వాస్‌కు రూ.5 కోట్ల ఆఫర్?
, బుధవారం, 23 జులై 2014 (09:30 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్‌కు ఓ టీవీ రియాలిటీ షో నిర్వాహకులు భారీ ఆఫర్ ఇవ్వజూపినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ బంపర్ ఆఫర్‌లో భాగంగా ఆయనకు రూ.5 కోట్లు ఇచ్చేందుకు రియాలిటీ షో నిర్వాహకులు ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్-8' నిర్మాతలు తమ కార్యక్రమానికి వస్తే రూ.5 కోట్లు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే, స్వతహాగా మంచి కవి అయిన కుమార్.. ఆతర్వాత రాజకీయ నేతగా మారిన విషయం తెల్సిందే. దీనిపై విశ్వాస్ సన్నిహితులు స్పందిస్తూ.. బిగ్‌బాస్ ఆఫర్ మాట కూడా వాస్తవమేనని చెప్పారు. అయితే తాను పాల్గొంటున్నదీ లేనిదీ మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu