Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సామాజిక మీడియాలో.. సామాజిక వేత్త అన్నా హజారేకు హత్యా బెదిరింపు..!

సామాజిక మీడియాలో.. సామాజిక వేత్త అన్నా హజారేకు హత్యా బెదిరింపు..!
, గురువారం, 5 మార్చి 2015 (10:13 IST)
శాంతి దూత మహాత్మా గాంధీజీ హత్యకు గురయ్యారు. అదే బాటలో ఆయన శిష్యుడు అన్నా హజారే కూడా హత్యకు గురవుతారేమో అనే భయం ఏర్పడుతోంది. అన్నా హజారేని చంపేస్తానని ఒక ప్రవాస భారతీయుడు ఫేస్‌బుక్‌లో కామెంట్ పెట్టాడు. అదే విధంగా ఆయన అనుచరులకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి. 
 
ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఉద్యం చేపట్టాడు. ఇది కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే ఫేస్‌బుక్ ద్వారా బెదిరింపు సందేశాలు మొదలు పెట్టారు. 'అన్నా హజారే టైమ్ అయిపోయింది. ఆయన్ని చంపే టైమ్ వచ్చింది. కాబోయే నాథూరామ్ గాడ్సేని నేనే’’ అని కెనడాకు చెందిన ఒక ఎన్నారై గగన్ విధు తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్టు పెట్టాడు.
 
దీనిపై హజారే ఆఫీసు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు గగన్‌తో పాటు అతనికి సహకరించిన నీల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అలాగే, హజారే భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, ఫేస్‌బుక్ సందేశం వచ్చిన కంప్యూటర్ ఐపీ అడ్రస్ కనుగొనడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అన్నా మద్దతుదారుడు అశోక్ గౌతమ్‌కు కూడా బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. మొత్తానికి ఉద్యమం వేడి పుట్టిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu