Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధైర్యముంటే 2 లేదా 5 మంది పోలీసులను చంపేయండి : పటేళ్ళకు హార్దిక్ పటేల్ పిలుపు

ధైర్యముంటే 2 లేదా 5 మంది పోలీసులను చంపేయండి : పటేళ్ళకు హార్దిక్ పటేల్ పిలుపు
, ఆదివారం, 4 అక్టోబరు 2015 (08:27 IST)
లక్ష్యసాధన కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యముంటే అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్న పోలీసులను చంపేయాలని పటేల్ సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తున్న యువ కెరటం హార్దిక్ పటేల్ పిలుపునిచ్చారు. అంతేకానీ, ఏ ఒక్క పటేల్ సామాజిక వర్గానికి చెందిన యువకుడు కూడా బలిదానాలకు పాల్పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
పటేళ్ల ఉద్యమానికి మద్దతుగా ఆత్మహత్య చేసుకొంటానని విపుల్‌ దేశాయ్‌ ఓ ప్రకటన చేశాడు. దీనిపై హార్దిక్‌ స్పందించడమే కాకుండా, విపుల్‌ దేశాయ్‌ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 
 
అనంతరం విపుల్ రాయ్ మాట్లాడుతూ ఆత్మహత్య ఆలోచనను వీడి, అవసరమైతే ఇద్దరు ముగ్గురు పోలీసులను చంపేయమని తమ నేత సలహా ఇచ్చినట్లు విపుల్ దేశాయ్ వెల్లడించారు. అయితే, తాను పోలీసులను చంపమని ఎవ్వరికీ సలహా ఇవ్వలేదని హార్దిక్‌ వివరణ ఇచ్చారు. ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేందుకు ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu