Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షేర్ ఆటోలో కిడ్నాప్ చేసి ఎటెటో తిప్పారు... దీప్తి సర్నా

షేర్ ఆటోలో కిడ్నాప్ చేసి ఎటెటో తిప్పారు... దీప్తి సర్నా
, శనివారం, 13 ఫిబ్రవరి 2016 (12:33 IST)
స్నాప్ డీల్ ఉద్యోగి దీప్తీ సర్నాను షేర్ ఆటోలోనే కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెను ఎక్కడెక్కడో తిప్పారు. ఐతే తన జీవితాన్ని నాశనం చేసే పెను ప్రమాదం నుంచి ఆమె తప్పించుకున్నానని చెప్పింది. కిడ్నాపర్లు తనకు ఎలాంటి హాని తలపెట్టలేదనీ, వారిని వదిలేయమని కూడా చెప్పుకొచ్చింది. బుధవారం రాత్రి నుంచి అదృశ్యమైన దీప్తి సర్నా ఉదంతం సుఖాంతం కాగా, ఆమె తన తల్లిదండ్రులను కలుసుకుంది. తనకు ఏమైందోననే విషయాన్ని స్వయంగా పోలీసులకు వెల్లడించింది.
 
ఇంటికి వెళ్లేందుకు షేర్ ఆటోను తాను ఎక్కానని అందులో ఓ మహిళతో పాటు మరో ముగ్గురు యువకులు ఉన్నారని చెప్పింది. తన స్నేహితురాలితో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆటో దారి మళ్లడాన్ని గమనించి కేకలు పెట్టానని, ఆ వెంటనే ఆటోలో ఉన్న మిగతావారు తనను అరవకుండా బంధించి, కిడ్నాప్ చేశారని తెలిపింది.
 
దీప్తి అదృశ్యమైన తరువాత, కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 200 మందిని రంగంలోకి దింపి విస్తృతంగా సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు ఏ హానీ జరగలేదని ఘజియాబాద్ ఎస్పీ ధర్మేంద్ర సింగ్ వెల్లడించారు. ఆమె పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నదని, కోలుకున్నాక మరోసారి విచారిస్తామని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu