Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నా మర్మాయవాల గురించి మాట్లాడే తమ్ముళ్లూ'... కేరళ యువతి ఘాటైన పోస్ట్

ఒక యువతిని 14 సెకన్ల పాటు కన్నార్పకుండా మహిళను చూసిన పురుషుల మీద కేసు పెట్టొచ్చని కేరళ ఎక్సైజ్‌ కమిషనర్‌ రిషిరాజ్‌ సింగ్‌ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. దీనికి ఓ కేరళ అమ్మాయి ఫేస్‌బుక్‌లో ఘాటైన పోస్ట్‌తో న

'నా మర్మాయవాల గురించి మాట్లాడే తమ్ముళ్లూ'... కేరళ యువతి ఘాటైన పోస్ట్
, ఆదివారం, 28 ఆగస్టు 2016 (10:21 IST)
ఒక యువతిని 14 సెకన్ల పాటు కన్నార్పకుండా మహిళను చూసిన పురుషుల మీద కేసు పెట్టొచ్చని కేరళ ఎక్సైజ్‌ కమిషనర్‌ రిషిరాజ్‌ సింగ్‌ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. దీనికి ఓ కేరళ అమ్మాయి ఫేస్‌బుక్‌లో ఘాటైన పోస్ట్‌తో నిరసన తెలిపింది. ఆ పోస్ట్‌కు రిప్లైగా అసభ్యకరమైన కామెంట్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. దీనికామె కుంగిపోలేదు. అంతకంటే బలమైన వాదనతో అందరి నోళ్లు మూయించింది. ఇప్పుడీమె పోస్ట్‌ ఫేస్‌బుక్‌లో సంచలనం సృష్టిస్తోంది. 
 
వనజ వాసుదేవ్‌. కేరళలోని ఆలప్పుళ నివాసి. ఆగస్టు 16న కేరళ ఎక్సైజ్ కమిషనర్ రిషిరాజ్‌ సింగ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆమెకు రుచించలేదు. 14 సెకన్లపాటు పురుషుడు ఒక స్త్రీ‌ని చూసినంత మాత్రాన అతని మీద కేసు ఫైల్‌ చేయటం అసమంజసం అనిపించింది. ఈ విషయం మీద తన అభిప్రాయాన్ని ప్రకటించటానికి ఫేస్‌బుక్‌నే వేదికగా ఎంచుకున్న వనజ నిర్భయంగా, ముక్కుసూటిగా మనసులోని ఆలోచనల్ని పోస్ట్‌ చేసేసింది. 
 
ఆ పోస్ట్‌లో ఏం చెప్పిందంటే....‘స్త్రీ పురుషులు ఒకర్నొకరు చూసుకోవటమనేది అత్యంత సహజమైన చర్య. బహిరంగ ప్రదేశాల్లో అందమైన మగవాళ్లు నావంక కాన్నర్పకుండా కొంతసేపు చూడటాన్ని నేనూ ఎంజాయ్‌ చేస్తాను. అయితే అంతమాత్రాన వాళ్లు నన్ను చూసి సెక్సీ కామెంట్లు చేస్తే ఊరుకోను. ఎంతసేపు చూడాలి? ఎంతసేపట్లో చూపు తిప్పుకోవాలి? అనే వాటికి కొలమానం ఏమిటి?' అంటూ వనజ పోస్ట్ చేసింది. 
 
ఈ పోస్ట్‌కు ఎన్నో కామెంట్లొచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం పురుషుల నుంచే వచ్చాయి. తమకు మద్దతుగా ఓ స్త్రీ పోస్ట్‌ పెట్టడాన్ని సమర్థించాల్సిన వాళ్లు ఘాటైన విమర్శలు చేశారు. కొంతమందైతే ఆమెను వ్యభిచారుల కోవలోకి తోసేశారు. ఇంకొంతమంది మరింత దిగజారి కోరిక తీర్చటానికి ఆమె రేట్‌ ఎంతో ప్రైవేట్‌ మెసేజ్‌లలో అడిగేశారు. అయితే ఇంతమందికి పర్సనల్‌గా రిప్లై ఇవ్వటం అనవసరం అని భావించిన వనజ రెండో పోస్ట్‌ పెట్టేసింది. ఈ పోస్టే ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ట్రెండ్‌ అవుతోంది.
 
‘నా మర్మాయవాల గురించి మాట్లాడే తమ్ముళ్లూ... నాకు సంస్కారం నేర్పించే అర్హత మీకు లేదు’ అంటూ నేరుగా కాకపోయినా ఫేస్‌బుక్‌ పోస్ట్‌తో చెంప పగులగొట్టేసింది. అంతేకాదు తన గౌరవానికి వెలకట్టాలనుకున్నవాళ్లకి ఎన్ని గుండెలు? అని కూడా నిలదీసింది. ఇప్పుడిదే పోస్ట్‌ కేరళలో సంచలనమైంది. కోజికోడ్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత నాయర్‌, కేరళ ఫిల్మ్‌ మేకర్‌ ఆషిక్‌ అబుతోపాటు ఇంకొంతమంది ప్రముఖులు వనజ పోస్ట్‌ను షేర్‌ చేసేశారు. అంతేనా, ఆమె జీవితంలో పడిన కష్టనష్టాలను ఎఫ్‌బి ద్వారా ఏకరవు పెట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదే పవన్ ప్రత్యేకత... 'ఒకే ఒక్కడు'.. 65 నిమిషాలు ఊర్రూతలూగించాడు...