మన్మథ రాజా.. మన్మథ రాజా... ఇద్దరు మహిళలతో ఆప్ మంత్రి రాసకేళి.. వీడియో ఔట్... కేజ్రీ ఫైర్... మినిస్టర్ పోస్ట్ ఊస్ట్...
మన్మథ రాజా... మన్మథ రాజా... అంటూ ఓ పాట మనకు తెలిసిందే. ఇది రాసలీలలకు సంబంధించింది. ఇప్పుడు ఆప్ సామాజిక న్యాయం, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఇద్దరు మహిళలతో రాసకేళిలో తేలిపోతున్నట్లు ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆప్ మంత్రి వీడియో సీడి బయటకు రావడంతో ఢిల్ల
మన్మథ రాజా... మన్మథ రాజా... అంటూ ఓ పాట మనకు తెలిసిందే. ఇది రాసలీలలకు సంబంధించింది. ఇప్పుడు ఆప్ సామాజిక న్యాయం, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఇద్దరు మహిళలతో రాసకేళిలో తేలిపోతున్నట్లు ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆప్ మంత్రి వీడియో సీడి బయటకు రావడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి షాకయ్యారు.
ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో మంత్రిగారి రాసలీలలకు సంబంధించిన సీడిపై చర్చించారు. ఈ సీడిలో ఉన్నది మంత్రిగారేనని తెలియరావడంతో వెనువెంటనే అతడిపై చర్య తీసుకున్నారు ముఖ్యమంత్రి. అతడిని పదవి నుంచి తప్పిస్తూ ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకున్నారు.