Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేజ్రీవాల్ పశ్చాత్తాపంపై గజేంద్ర తండ్రి మండిపాటు.. మీ క్షమాపణ మా కొడుకును బతికిస్తుందా?

కేజ్రీవాల్ పశ్చాత్తాపంపై గజేంద్ర తండ్రి మండిపాటు.. మీ క్షమాపణ మా కొడుకును బతికిస్తుందా?
, శనివారం, 25 ఏప్రియల్ 2015 (13:14 IST)
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రైతు గజేంద్ర ఆత్మహత్యపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘తప్పు జరిగింది’ అని పశ్చాత్తాపం వ్యక్తం చేయగా, మృతుని తండ్రకి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పశ్చాత్తాపం నా కొడుకును బతికించగలదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే, తమ బిడ్డ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
 
కాగా, రైతు ఆత్మహత్యపై రెండు రోజులపాటు మౌనం వహించిన కేజ్రీవాల్.. శుక్రవారం రైతు కుటుంబాన్ని క్షమాపణ కోరారు. ఈ క్షమాపణ ను గజేంద్ర కుటుంబం తిరస్కరించింది. దానివల్ల తమకు ఒరిగేదేమీ లేదంది. ‘నేను తప్పుచేశాను. ఘటన తర్వాత నా ప్రసంగాన్ని ఆపాల్సింది... కొనసాగించడం ద్వారా ప్రజలను, గజేంద్ర కుటుంబాన్ని బాధపెట్టాను. ఆయన కుటుంబాన్ని క్షమాపణ కోరుతున్నా’ అన్నారు. 
 
‘ఈ విషయంలో తప్పు చేసిన వారిని అవసరమైతే ఉరితీయండి. కానీ రైతు ఆత్మహత్యలకు కారణమైన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించండి’ అని కేజ్రీ పార్టీలను కోరారు. ఘటన రోజు తన మనసు వికలమై, ఆ రాత్రి నిద్ర పోలేదన్నారు. ఆత్మహత్యపై పోలీసులను నిందించడమూ తప్పేనన్నారు. అయితే కేజ్రీ పశ్చాత్తాపంపై గజేంద్ర తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆయన క్షమాపణ మా కొడుకును బతికిస్తుందా?’ అని ప్రశ్నించారు. ‘ఆయన కొడుక్కు ఏదైనా అయితే నేను క్షమాపణ చెబితే సరిపోతుందా? అని గజేంద్ర తండ్రి బన్నేసింగ్‌ ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu