Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక మనవంతు.. కశ్మీర్ క్రీడాకారుడికి వీసా నిరాకరించిన అంకుల్ శ్యామ్

ఏడు ముస్లిం దేశాల పౌరులను మాత్రమే తమ భూభాగంలోకి అడుగు పెట్టనివ్వమని ఆంక్షలు విధించిన అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనాయంత్రాంగం ఇప్పడు భారత ముస్లింలపై కన్నేసింది. ఫిబ్రవరి 24న న్యూయార్క్‌లో జరగనున్న వరల్డ్ స్నో షో చాంపియన్సిప్‌లో పాల్గొనడాన

ఇక మనవంతు.. కశ్మీర్ క్రీడాకారుడికి వీసా నిరాకరించిన అంకుల్ శ్యామ్
హైదరాబాద్ , బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (03:54 IST)
ఏడు ముస్లిం దేశాల పౌరులను మాత్రమే తమ భూభాగంలోకి అడుగు పెట్టనివ్వమని ఆంక్షలు విధించిన అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనాయంత్రాంగం ఇప్పడు భారత ముస్లింలపై కన్నేసింది. ఫిబ్రవరి 24న న్యూయార్క్‌లో జరగనున్న వరల్డ్ స్నో షో చాంపియన్సిప్‌లో పాల్గొనడానికి వీసా దరఖాస్తు చేసుకున్న కశ్మీరీ క్రీడాకారుడు తన్వీర్ హుస్సేన్, అతడి మేనేజర్‌కి ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ వీసాలను తృణీకరించడం షాక్ కలిగిస్తోంది.
 
ప్రపంచ స్థాయి క్రీడలో పాల్గొనడానికి కఠోర శిక్షణ తీసుకున్న తనకు  తన మేనేజర్ అబిడ్ ఖాన్‌కు వీసాలు మంజూరు చేయలేమని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేయడంతో తీవ్ర నిరాశ కలిగిందని, మనసు గాయపడిందని  24 ఏళ్ల తన్వీర్ హుస్సేన్ వివరించారు. ఇటలీలో జరిగిన స్నోషో చాంపియన్ షిప్ పోటీలకు కూడా గత ఏడాది భారత్ తరపున హాజరయ్యానని, కాని అమెరికాలో క్రీడాకారులకు వీసాలు మంజూరు చేయడంలో ఏవయినా సమస్యలు ఉన్నాయేమో తెలీదని తన్వీర్ వాపోయాడు. 
 
ఫిబ్రవరి 24న అమెరికాలో నిర్వహిస్తున్న ఈ క్రీడకోసం దాదాపు నెలరోజులుగా గుల్‌మార్గ్‌లో శిక్షణ పొందానని, పోటీకి సన్నాహమవుతున్నానని, కానీ పోటీలో పాల్గొనే అవకాశం తనకు రాదని ఊహించలేదని తన్వీర్ వాపోయాడు. 
 
అమెరికాలో జరిగే ఆ ఈవెంట్ కోసం అయిదుగురు కాశ్మీరీలను ఆహ్వానించగా స్పాన్సర్ షిప్ సమస్యల కారణంగా తామిద్దరం మాత్రమే వీసాకు దరఖాస్తు చేశామని, అన్ని పత్రాలూ సమర్పించామని కానీ తమకు వీసా నిరాకరించారని తన్వీర్ తెలిపాడు. 
 
న్యూయార్క్ స్థానిక మేయర్ క్లైడ్ రబిడ్యు మాట్లాడుతూ ఈ కఠోర నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడానికి అమెరికా ప్రభుత్వం ప్రతినిధులతో సంప్రదిస్తున్నానని చెప్పారు.
 
ఉగ్రవాదులకు ఆంక్షలు విధించడం మాటేమో కానీ ట్రంప్ డిక్రీ దేశదేశాల ముస్లింలను వెంటాడటానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్కసారి అమెరికాను వదిలి వెళ్లారో తిరిగి రావడం కల్లే..