ఎల్లప్పుడు కాల్పుల శబ్దంతో దద్దరిల్లుతున్న జమ్మూకాశ్మీర్‌లో ఈ రోజు ఉదయం భారీ కాల్పులు జరిగింది. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పంజ్‌గమ్ గ్రామంలో శనివారం ఉదయం భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రత దళాలు హతమార్చాయి. కాల్పుల అనంతరం సైన్యం నిర్వహించిన సోదాల్లో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలు లభించాయి.
అంతేకాకుండా ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రత దళాలు స్వాధీనం చేసుకుంది. చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు మరికొంతమంది తీవ్రవాదులు కూడా రంగంలోకి దిగి ఉంటారని సైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సైనిక బలగాలు ఆ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. చనిపోయిన ఉగ్రవాదులను హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా గుర్తించారు.